ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కలిసి పనిచేద్దాం.. అభివృద్ధి సాధిద్దాం

ABN, Publish Date - Mar 26 , 2024 | 10:42 PM

పర్చూరు నియోజకవర్గంలో వలసల పర్వం జోరందుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారికి పార్టీ కండువాలుకప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. దీంతో పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున ఏలూరి సమక్షంలో చేరుతున్నారు. కడవకుదురు, ఆదిపూడి, పర్చూరు నుంచి పెద్ద ఎత్తున మంగళవారం పార్టీలో చేరారు.

కడవకుదురులో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారితో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పలువురు టీడీపీలో చేరిక

పర్చూరు, మార్చి 26: పర్చూరు నియోజకవర్గంలో వలసల పర్వం జోరందుకుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారికి పార్టీ కండువాలుకప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. దీంతో పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున ఏలూరి సమక్షంలో చేరుతున్నారు. కడవకుదురు, ఆదిపూడి, పర్చూరు నుంచి పెద్ద ఎత్తున మంగళవారం పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిన అభివృద్ధి పనులన్నింటిని పునఃప్రారంభిస్తామన్నారు. గత తెలుగుదేశం హయాంలో పర్చూరు నియోజవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించినట్టు గుర్తుచేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు, ఇళ్లు నిర్మించి ఇచ్చేవిధంగా కృషిచేస్తామని చెప్పారు.

ఆదిపూడి గ్రామం నుంచి వైసీపీకి చెందిన పారి స్టీఫెన్‌, పారి జీవన్‌, జోసెఫ్‌, తేళ్ల మధు, బత్తుల బ్లేస్సీ, జాన్‌పాల్‌, మహేష్‌, బత్తుల క్రాంతి కుమార్‌, మాణిక్యరావు, శ్రీకాంత్‌, ప్రభుదాసు, కత్తి మధు, గద్దె కార్తీక్‌లకు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే, కడవకుదరు గ్రామానికి చెందిన వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో చేరారు. పార్టీలోకి చేరిన వారిలో పైనం గోపి, పైనం సురేష్‌, కేసన సురేష్‌, బొర్ర అశోక్‌, సురగాని రామకృష్ణ, పైనం కాశీరాం, బొర్ర ఫణి, బొర్ర శోభనరావు, ఈఊరి నారాయణ, కేసన సాంబయ్య, తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు ముత్యాల రాజేష్‌, అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, దీర్ఘాల రమేష్‌ తెలుగుదేశం, జనసేన, బీజేసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఏలూరి విస్తృత పర్యటన

పర్చూరు నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విస్తృతంగా పర్యటించారు. మార్టూరు, నూతలపాడు, భీమవరం, ఇంకొల్లు, దగ్గుబాడు, వింజనంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలను పలుకురిస్తూ, పలు కుటుంబాలను ఓదారుస్తూ ముందుకు సాగారు. ఉదయం ఏలూరి క్యాంపు కార్యాలయంలో పలుగ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో మాట్లాడారు. దగ్గుబాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎం.మక్బూల్‌ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. నూతలపాడుకు చెందిన కానిశెట్టి సుబ్బారావు పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంకొల్లుకు చెందిన నాయుడు రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - Mar 26 , 2024 | 10:42 PM

Advertising
Advertising