ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రుణ రగడ

ABN, Publish Date - Mar 21 , 2024 | 01:37 AM

ఓ రాజకీయ నాయకుడు పలువురి రైతుల పేర్లతో బ్యాంకు నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో గందరగోళం నెలకొంది.

రైతుల పేరుతో బ్యాంకులో ఓ నేత రుణాలు

తిరిగి చెల్లించాలంటూ సిబ్బంది నోటీసులు

ఆందోళనకు దిగిన బాధితులు

నాగులుప్పలపాడు, మార్చి 20 : ఓ రాజకీయ నాయకుడు పలువురి రైతుల పేర్లతో బ్యాంకు నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో గందరగోళం నెలకొంది. బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపడంతో వారంతా బ్యాంకు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. విషయం తెలిసి ఆ నాయకుడి అనుచరులు వచ్చి సర్దిచెప్పడంతో వెనుతిరిగారు. ఈ ఘటన నాగులుప్పలపాడులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వేటపాలెంకు చెందిన ఓ రాజకీయ నాయకుడి సోదరుడు, ప్రస్తు తం ఓ కీలక పార్టీకి జిల్లాస్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న నాయ కుడు ఈ రుణ మేత వెనుక ఉన్నారు. గతంలో మండలంలోని అమ్మనబ్రోలు, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం, కనపర్తి తదితర గ్రామాల్లో తన సామాజికవర్గానికి చెందిన వారిని బినామీలుగా చూపి వారి పేర్లతో కనపర్తి ప్రాంతంలోని భూములకు అప్పటి రెవెన్యూ అధికారుల అండదండలతో రికార్డులను సృష్టించారు. ఆయా భూములకు సంబంధించిన పత్రాలతో 2021లో ఎన్‌జీపాడులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఒక్కో రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు పొందారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని బ్యాంకు అఽధికారులు పలుమార్లు సంబంధిత రైతులకు నోటీసులు జారీచేశారు. నోటీసులు తీసుకున్న రైతులు సదరు నాయకుని వద్దకు వెళ్లి విషయాన్ని ప్రస్తావించగా త్వరలోనే తిరిగి చెల్లించి మీపై ఒత్తిడి లేకుండా చేస్తానని హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు అందుకున్న రైతులు బుధవారం ఏం చేయాలో అర్థంకాక ఏపీజీబీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ నాయకుడి అనుచరులు బ్యాంకు వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని తీసుకున్న రుణాలను వడ్డీతో సహా గురువారం బ్యాంకుకు తిరిగి జమచేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 21 , 2024 | 01:37 AM

Advertising
Advertising