విద్యుత్ స్తంభాల ఏర్పాటులో మాయాజాలం
ABN, Publish Date - Nov 02 , 2024 | 11:36 PM
కొత్తపేట నుంచి వాడరేవుకు వెళ్లే దారిలో 216 జాతీయ రహదారి పక్కన నూతనంగా వేసిన విద్యుత్ స్తంభాలతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై స్థానికుల్లో చర్చ నడుస్తోంది. హాయ్ రెస్టారెంట్ ఎదురు వాడరేవు రోడ్డుకు ఒక వైపు స్థలం వ్యక్తుల దరఖాస్తు మేరకు నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చే స్తున్నారు.
ప్రభుత్వ స్థలం కబ్జా అయ్యే ప్రమాదం?
చీరాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కొత్తపేట నుంచి వాడరేవుకు వెళ్లే దారిలో 216 జాతీయ రహదారి పక్కన నూతనంగా వేసిన విద్యుత్ స్తంభాలతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై స్థానికుల్లో చర్చ నడుస్తోంది. హాయ్ రెస్టారెంట్ ఎదురు వాడరేవు రోడ్డుకు ఒక వైపు స్థలం వ్యక్తుల దరఖాస్తు మేరకు నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చే స్తున్నారు. ప్రైవే టు వ్యక్తుల స్థలానికి ప్రస్తుతం కరెంట్ పోల్స్ వేసిన ప్రదేశానికి మధ్య ప్రభుత్వ స్థలం ఉంది. ఆ రెండు స్థలాలకు హద్దు వద్ద స్ట్రయిట్‌లైన్ వేయాల్సి ఉండగా, మధ్యలో ప్రభుత్వ స్థలాన్ని వదిలి ఉద్దేశపూర్వకంగా ఇవతల స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా కరెంట్ స్తంభాలను వేస్తే అవతల ఉన్న ప్రయివేటు వ్యక్తులు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలం ఎంత వరకు ఉందో ఆ హద్దులో స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై సదరు కాంట్రాక్టరు, అధికారులను వివరణ కోరగా.. వాస్తవానికి స్ట్రయిట్ లైన్ ఉంటేనే విద్యుత్ లైన్ బలంగా ఉంటుందన్నారు. మరోసారి పరిశీలించి అవసరమైతే వేసిన స్తంభాలను మారుస్తామని చెప్పారు. విలువైన ప్రభుత్వ భూమి పరుల పరం అవుతుందనే స్థానికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
Updated Date - Nov 02 , 2024 | 11:36 PM