ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అకాల వర్షాలతో పైర్లకు భారీగా నష్టం

ABN, Publish Date - Oct 23 , 2024 | 12:26 AM

వారంరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలో పొంగి ప్రవహించాయి. దీంతో పొగాకు, మిర్చి, బొబ్బర్లు, టమాటా, మొక్కజొన్న పంటలకు భారీనష్టం వాటిల్లింది.

తర్లుపాడు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వారంరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలో పొంగి ప్రవహించాయి. దీంతో పొగాకు, మిర్చి, బొబ్బర్లు, టమాటా, మొక్కజొన్న పంటలకు భారీనష్టం వాటిల్లింది. ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలన్ని చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పొగాకు, మిర్చి, టమాటా, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో దాదాపుగా ఇప్పటి వరకు 1000 ఎకరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తొంది. మిర్చి పంట 500 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఎకరాకు మిర్చి పంటకు ఎకరాకు రూ.70 వేలు, పొగాకు సాగుకు రూ.50 వేలు, పెట్టుబడి అయినట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతన్నలు భారీగా నష్టపోయామని బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తర్లుపాడు : ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపైరు పూర్తిగా దెబ్బ తిన్నట్లు వ్యవసాయాధికారి టి.వెంక టేశ్వర్లు అన్నారు. మండలంలోని బోరుగుంతలపాడు, బుడ్డపల్లె గ్రామాల్లో ‘పొలంపిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి, మిరప, పొగాకు తోటలను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలపై తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వీఏఏలు శంకర్‌, బాబు, శ్వేత, చంద్రశేఖర్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:26 AM