ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొగ రాకుండా చర్యలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:30 PM

వేటపాలెం మండలం రామా పురంలోని సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌ యూనిట్‌లో వస్తున్న పొగ, యంత్రాల పని తీరును చీరాల మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌ బుధవారం పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం కమిష నర్‌గారూ ఈ పొగ మా టేంటి అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మున్సిపల్‌ ఏఈ, ఇన్‌ స్పెక్టర్లతో కలసి రామాపురంలోని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను సందర్శించా రు.

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ పరిశీలిస్తున్న కమిషనర్‌ రషీద్‌

చెత్తను వేగంగా తరలిస్తాం

మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌

వేటపాలెం(చీరాల), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : వేటపాలెం మండలం రామా పురంలోని సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌ యూనిట్‌లో వస్తున్న పొగ, యంత్రాల పని తీరును చీరాల మున్సిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌ బుధవారం పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం కమిష నర్‌గారూ ఈ పొగ మా టేంటి అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మున్సిపల్‌ ఏఈ, ఇన్‌ స్పెక్టర్లతో కలసి రామాపురంలోని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను సందర్శించా రు. అక్కడ చెత్త ఎందుకు తగులబడుతుంది, పొగ ఎందుకు వస్తుందని పరిశీలించిన మీద ట పేరుకుపోయిన చెత్త అడుగుభాగంలో ఉష్ణోగ్రత పెరిగి పొగవస్తుందని అక్కడి సిబ్బంది తెలిపారు. అలా పొగరాకుండా డోజర్లతో తగిన చర్య లు చేపడతామన్నారు. గుంటూరు జిందాల్‌ ప్లాంట్‌కు చెత్తను రోజు కు మార్చి రోజు తరలించే ప్రక్రియ జరుగుతుందన్నారు. దీంతో పాటు మరో 16 మెట్రిక్‌ టన్నులను టిప్పర్ల ద్వారా రోజు రెండు ట్రిప్పులు అద్దె ప్రాతిపదికన తరలించేందుకు టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. మరమ్మతులకు గురైన మిషన్‌లను బాగుచేయించి పురపాలక సిబ్బందితో నడిపేందుకు చర్యలు చేపడతామని కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 11:31 PM