ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తూర్పున మోస్తరు... పశ్చిమాన జల్లులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:17 AM

జిల్లాలో వాతావరణం మారింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి జల్లులు పడుతున్నాయి. తూర్పుప్రాంతంలో ఒకమోస్తరు వాన కురిసింది. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జరుగుమల్లి మండలంలో 16.4మి.మీ, సింగరాయకొండలో 16.0మి.మీ, ఒంగోలులో 12.8మి.మీ, కొత్తపట్నంలో 10.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఒంగోలులో కురుస్తున్న వర్షం

జిల్లావ్యాప్తంగా వాన

మరో రెండు రోజులు వర్ష సూచన

మరింత ఊపందుకోనున్న రబీ సాగు

ఒంగోలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వాతావరణం మారింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి జల్లులు పడుతున్నాయి. తూర్పుప్రాంతంలో ఒకమోస్తరు వాన కురిసింది. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జరుగుమల్లి మండలంలో 16.4మి.మీ, సింగరాయకొండలో 16.0మి.మీ, ఒంగోలులో 12.8మి.మీ, కొత్తపట్నంలో 10.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒంగోలులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక మోస్తరు వాన కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు పారింది. సాయంత్రం వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవరాల్లోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురవగా, పశ్చిమప్రాంతంలో జల్లులు పడ్డాయి. ఇవి సాగుకు ఉపయుక్తం కానున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పైర్లలో దాదాపు లక్షన్నర హెక్టార్లలో పంటలు పొలంలో ఉన్నాయి. ప్రస్తుత రబీలో సుమారు 33 వేల హెక్టార్లలో పైర్లు వేశారు. వీటన్నింటికీ తాజా వర్షాలు మేలు చేయను న్నాయి. అంతేకాక మరో రెండు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలా ఒక మోస్తరు వర్షం కురిస్తే జిల్లాలో రబీ సాగు మరింత ఊపందుకోనుంది. ప్రత్యేకించి పొగాకు, శనగ విస్తారంగా సాగయ్యే అవకాశం ఉంది.

Updated Date - Nov 13 , 2024 | 01:17 AM