ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి నిధుల మంజూరుకు మంత్రి హామీ

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:35 AM

నిలిచిపోయిన కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు హమీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు మంత్రిని సచివాలయంలో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు.

మంత్రి అచ్చెనాయుడుతో చర్చిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు

దర్శి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నిలిచిపోయిన కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు హమీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు మంత్రిని సచివాలయంలో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నిలిచిపోయిన పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు. అందులోభాగంగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరంభించి మధ్యలో నిలచిపోయిన కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరగా మంత్రి అచ్చెనాయుడు నిధులు విడుదల చేస్తామని స్పష్టమైన హమీ ఇచ్చినట్లు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలో అగ్రికల్చర్‌ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:35 AM