ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రులను కలిసిన నారాయణరెడ్డి

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:21 AM

రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమశాఖామాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం అమరావతి లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిశారు.

మార్కాపురం, అక్టోబరు 3: రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమశాఖామాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం అమరావతి లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిశారు. మంత్రి కొల్లు రవీంద్రతో ఇసుక వలన ఎదుర్కొం టున్న ఇబ్బందులు వివరించారు. మార్కాపురం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని పలకల పరిశ్రమకు రాయల్టీ ఫీజులు తగ్గించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి కోరారు. ప్రధానంగా ఇసుక టన్నేజీ విషయంలో స్పష్టత లేకపోవడంతో టన్ను ధర రూ.2వేల వరకు పడుతోందన్నారు. దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోతున్నా యని, పర్యవసానంగా కూలీ లకు పనిదొరక్క అవస్థలు పడాల్సివస్తోందని తెలియ జేశారు. స్పందించిన మంత్రి రవీంద్ర టన్నేజీతో సంబందం లేకుండా ఇసుక తీసుకువెళ్లేలా త్వరలోనే ఆదేశాలు ఇవ్వను న్నట్లు తెలిపారు. పలకల పరిశ్రమకు సంబందించి రాయల్టీ తగ్గించేందుకు తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమాత్యులు స్వామిని జిల్లా ఎమ్మెల్యేలు పలువురితో కలిసి వెళ్లి కలిశారు. ఈ సందర్బంగా డివిజన్‌లోని పలు సమస్యలను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మంత్రికి తెలియజేశారు.

Updated Date - Oct 04 , 2024 | 01:21 AM