శింగరకొండలో నిత్యాన్నదానం
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:56 PM
శింగరకొండలో దశాబ్ద కాలం క్రి తం ప్రారంభించిన నిత్య అన్నదానంకు ప్రస్తుతం భక్తుల సంఖ్య అనూ హ్యంగా పెరిగింది. ఒకప్పుడు శింగరకొండలో స్వామి వారి అన్నదానం పట్ల భక్తులు కొద్ది మంది మాత్రమే ఇష్టపడేవారు. తప్పని పరిస్థితులలో మా త్రమే కొంత మంది భక్తులు క్యూలైన్‌లో నిలబడి టోకెన్‌లు తీసుకొని తినే వారు. ఇప్పుడు పద్ధతి మారింది... క్యూలైన్‌తో పని లేదు... నేరుగా అన్నదాన మండపం దక్కరకే వెళ్లవచ్చు.. మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. అదే సమయంలో అధికారులు అన్నదానంపై ప్రత్యేక దృష్టి సారించడంతో భక్తులు పలు రకాల వంటకాలతో పుష్టి గా తింటున్నారు.
అన్ని రకాల వంటకాలతో రోజూ భోజనం
రాత్రి సమయంలోనూ వడ్డనకు ఏర్పాట్లు
ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు
అనూహ్యంగా పెరిగిన భక్తుల సంఖ్య
అద్దంకి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండలో దశాబ్ద కాలం క్రి తం ప్రారంభించిన నిత్య అన్నదానంకు ప్రస్తుతం భక్తుల సంఖ్య అనూ హ్యంగా పెరిగింది. ఒకప్పుడు శింగరకొండలో స్వామి వారి అన్నదానం పట్ల భక్తులు కొద్ది మంది మాత్రమే ఇష్టపడేవారు. తప్పని పరిస్థితులలో మా త్రమే కొంత మంది భక్తులు క్యూలైన్‌లో నిలబడి టోకెన్‌లు తీసుకొని తినే వారు. ఇప్పుడు పద్ధతి మారింది... క్యూలైన్‌తో పని లేదు... నేరుగా అన్నదాన మండపం దక్కరకే వెళ్లవచ్చు.. మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. అదే సమయంలో అధికారులు అన్నదానంపై ప్రత్యేక దృష్టి సారించడంతో భక్తులు పలు రకాల వంటకాలతో పుష్టి గా తింటున్నారు. గతంలో అన్నదానం నిర్వహణ, నాణ్యతపై భక్తుల నుంచి పలు సందర్భాలలో విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల ఈవోగాబాధ్యతలు చేపట్టిన తిమ్మానాయుడు గతంలో ఇదే దేవాలయంలో పనిచేసిన అనుభవం ఉండడంతో బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నదానం పై ప్రత్యేక దృష్టి సారించారు. తిమ్మానాయుడు బాధ్యతలు తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల లడ్డూలు, అన్నదానం పై పలు రకాల విమర్శలు రావడంతో సరుకుల సరఫరా టెండర్ దారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఉన్న స్టాకును కూడా వె నక్కి తీసుకు పోయి నాణ్యమైన సరుకులు సరఫరా చేసినట్లు తెలిసింది. ఇటీవల వరకు శింగరకొండ దేవస్థానంలో మఽధ్యా హ్న సమయంలో మాత్రమే పరిమిత సంఖ్యలో అన్నదానం ఉండేది. గత మంగళవారం నుంచి రాత్రి సమయంలో కూడా అన్నదానం ప్రారంభించారు. గతంలో శనివారం 500 మంది, ఆదివారం 350 మంది, మిగిలిన రోజులలో 200 మంది కి మా త్రమే అన్నదానం జరిగేది. ప్రస్తుతం మధ్యాహ్నాం సమయంలో శనివారం 700 నుండి 800 మంది, మిగిలిన రోజులలో 500 మంది కి పైగా అన్నదానం కు వస్తున్నారు. రా త్రి సమయంలో 50 మంది తో ప్రారంభించగా ప్రస్తుతం 100 కు చేరారు. ఇక అన్నదానం లో మొక్కుబడి ఆహార పదార్థాలు కాకుండా పొంగలి, పులిహోరతో పాటు పలు రకాల కూరలు, అప్పడాలతో భోజనం పెడుతున్నారు. అన్నం వండటానికి ప్రత్యేకంగా బాయిలర్‌లు ఉన్నాయి. ప్రస్తుతం అయ్యప్ప దీక్షా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్నదానం కు వచ్చే భక్తుల సంఖ్య పెరిగితే అన్నదాన మండపం ముందు అప్పటికప్పుడు టెంట్‌లు వేసి అదనంగా భోజనాలు వడ్డిస్తున్నారు. శింగరకొండ వచ్చిన భక్తులు అన్నం కోసం ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తుండడంతో సుదూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:56 PM