ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

37 మందికి నోటీసులు

ABN, Publish Date - Nov 14 , 2024 | 10:47 PM

ఆంధ్రజ్యోతిలో ఈ నెల 3వ తేదీన అధికారులకు కనిపించని ఇసుక తవ్వకాలు, రవాణా అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌ స్పందించారు. ఆ నేపథ్యంలో తమ కార్యాలయం నోటీ్‌సకు వచ్చిన అన్ని ప్రదేశాలను తనిఖీచేసి, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు ప్పాల్పడిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ప్రకటనలో తెలిపారు.

107 కేసులు, రూ.24లక్షల అపరాధ రుసుం వసూలు

మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

చీరాల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రజ్యోతిలో ఈ నెల 3వ తేదీన అధికారులకు కనిపించని ఇసుక తవ్వకాలు, రవాణా అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌ స్పందించారు. ఆ నేపథ్యంలో తమ కార్యాలయం నోటీ్‌సకు వచ్చిన అన్ని ప్రదేశాలను తనిఖీచేసి, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు ప్పాల్పడిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 37 మంది వ్యక్తులకు నోటీసులు ఇచ్చామన్నారు. కార్యాలయ పరిధిలో ఇప్పటి వరకు 107 కేసులలో రూ.24 లక్షలు అపరాధ రుసుము వసూలు చేయటం జరిగిందన్నారు. రెవెన్యూ, గనులు, భూగర్భశాఖ సిబ్బంది ఉమ్మడిగా నిర్వహించిన తనిఖీలలో అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌చేసి వేటపాలెం ఎస్‌హెచ్‌వోకు అప్పగించామన్నారు. ఆ క్రమంలో సంబంధీకులకు నోటీసులు జారీ చేశామన్నారు. నిర్ణీత అనుమతులు లేకుండా ఇసుక, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేపడితే చర్యలు తప్పవని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 10:47 PM