ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజల మనస్సులో ఎన్‌టీఆర్‌ చిరస్మరనీయుడు

ABN, Publish Date - May 28 , 2024 | 10:25 PM

తెలుగు ప్రజల మనస్సులలో ఎన్టీఆర్‌ చిరస్మరనీయంగా నిలిచి ఉంటాడని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజుగండి వద్ద ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్‌టీఆర్‌ అని అన్నారు.

ఎన్టీర్‌ జయంతి సభలో మాట్లాడుతున్న కొండయ్య

ఘనంగా జయంతి వేడుకలు

పలుచోట్ల సేవా కార్యక్రమాలు

టీడీపీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ

నందమూరికి నేతల నివాళులు

అద్దంకి, మే 28 : తెలుగు ప్రజల మనస్సులలో ఎన్టీఆర్‌ చిరస్మరనీయంగా నిలిచి ఉంటాడని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజుగండి వద్ద ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్‌టీఆర్‌ అని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకు వచ్చారన్నారు. సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టి పేదల గుండె ల్లో నిలిచి పోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అద్దంకి మండల, పట్టణ అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు, చిన్ని శ్రీనివాసరావు, కుందారపు రామారావు, కాకాని అశోక్‌, వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, స్టాలిన్‌, రామాంజనేయులు, గట్టుపల్లి రామారావు, సందిరెడ్డి రమేష్‌, శింగరకొండ లక్ష్మీనరశింహస్వామి దేవస్తానం చైర్మన్‌ న ర్రావుల కొండలు, పూనూరి నరేంద్ర, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

అద్దంకిటౌన్‌ : ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ బాపట్ల పార్టీమెంట్‌ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. ధేనువకొండ పునరావాసకాలనీ అ యిన బలరామకృష్ణపురంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. బోడపాటి వెంకయ్య, అన్నబత్తిన లక్ష్మినారాయణ, సురే్‌షబాబు, షేక్‌ కాశీవలి, రామాంజనేయులు మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఘనంగా వేడుకలు

బల్లికురవ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతిని మంగళవారం టీడీపీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, శ్రేణులకు మిఠాయి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జీవితం ఆదర్శం

పంగులూరు : సినీ, రాజకీయరంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు కొనియాడారు. మండలంలోని ముప్పవరంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్‌ 101వ జయంతి వేడుకలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నేతలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌, కుక్కపల్లి ఏడుకొండలు, గుర్రం ఆదిశేఖర్‌, ఓబుల్‌రెడ్డి, సుబ్బారావు, ధూళిపాళ్ల వీరనారాయణ, రౌతు వెంకటేశ్వర్లు, శివరాజు, రాధాకృష్ణ, జక్రయ్య, జగన్‌ పాల్గొన్నారు.

తెలుగు వెలుగు ఎన్టీఆర్‌ : కొండయ్య

చీరాల : తెలుగు వెలుగు ఎన్టీఆర్‌ అని, తెలుగుజాతి గౌరవాన్ని ఖండాంతరాలకు చాటిన మహోన్నతుడు, వెండితెర ఇలవేల్పు, నూనత రాజకీయ ఒరవడికి నాందిపలికిన దార్శనికుడు, యుగుపురుషుడు.. ఆయన ఖ్యాతి ఆచంద్ర తారార్కమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య అన్నారు. ఎన్టీఆర్‌ 101వ జయంతి వేడుకలను మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఘ నంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కొండయ్య మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్ని నమ్మి ప్రజాపక్షపాతిగా వారి శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించారన్నారు. రాజకీయ చైతన్య దీపికగా వెలుగొందారని కొనియాడారు. అనంతరం కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. సాయంత్రం ఏరి యా వైద్యశాలలో టీపీడబ్ల్యూ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాతాని ఉమామహేశ్వరరావు, గొడుగుల గంగరాజు, గుద్దంటి చంద్ర మౌళి, కూరపాటి పూర్ణచంద్రరావు, కౌతవరపు జనార్ధనరావు, డాక్టర్‌ సజ్జా హేమలత, డేటా నాగేశ్వరరావు, నాశిక వీరభద్రయ్య, వీరయ్య చౌదరి, గజవల్లి శ్రీనివాసరావు, షేక్‌ యాసిన్‌, డూడూరి శివరామప్రసాద్‌, కారంపూడి పద్మిని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు

పర్చూరు : తెలుగుజాతి ఔన్యత్యాన్ని దేశ విదేశాల్లో చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ నేతలు కొనియాడారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ కాం శ్య విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు షేక్‌ షం షుద్దీన్‌, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు కోడూరి శేషబ్రహ్మచారి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొల్లా సుభా్‌షబాబు, మానం హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివరాం ప్రసాద్‌, శివనాగేశ్వరరావు, నా గులపాలెం, చెరుకూరు, అడుసుమల్లిలో కార్యక్రమాలు నిర్వహించారు.

కారంచేడు : ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు మంగళవారం కారంచేడు మండలంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ కాంశ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దగ్గుబాటి చౌదరి, చాగంటి లక్ష్మీన్నారాయణ, చుండూరి రామయ్య, షేక్‌.హుస్సేన్‌, సర్పంచ్‌ బాలిగ శివరపార్వతి, కొత్తగొర్ల వెంన్న, సుభానీ, బసవయ్య, సెల్వరాజ్‌ పాల్గొన్నారు.

కారణజన్ముడు నందమూరి

మార్టూరు : కారణజన్ముడు ఎన్టీఆర్‌ అని టీడీపీ నేతలు నివాళులర్పించారు. టీడీపీ ఆఫీ్‌సలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తొండెపు ఆదినారాయణ, షేక్‌ రజాక్‌, కామినేని జనార్దన్‌, గొట్టిపాటి వెంకట్రావు, తాటి నాగేశ్వరరావు, తొట్టెంపూడి భుజంగరావు, తగెడ్త ఆంజనేయు పాల్గొన్నారు. ఎఫర్ట్‌ కార్యాలయంలో రోటరీ క్లబ్‌ వారు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాళ్లూరి సాంబశివరావు, జాష్టి సాంబశివరావు, ఆంజనేయులు, కాజారావు, బసవ రాములు, షేక్‌ కాజా హుస్సేన్‌ పాల్గొన్నారు.

ఏలూరి క్యాంపు కార్యాలయంలో ..

మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో వెంకట్‌, శివరాత్రి శ్రీను, చిరంజీవి , అనిల్‌, సుబ్బ రాయుడు పాల్గొన్నారు.

యద్దనపూడిలో : యద్దనపూడిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయం తిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కనపర్తి నాగేశ్వరరావు, కొండల రాయుడు, వీరయ్య, బాజీ, సతీష్‌, వాసు, తారకరామారావు, రావిపాటి సీత య్య పాల్గొన్నారు. గన్నవరం గ్రామంలో ప్రధాన సెంటర్లో నల్లపనేని రంగ య్య చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఎంపీటీసీ సబ్యుడు గొట్టిపాటి సతీష్‌, జడ్‌పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణమ్మ పాల్గొన్నారు.

వలపర్ల, ఇసుక దర్శి గ్రామాలలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా యద్దనపూడి మండలం వింజనంపాడు, పూనూరు గ్రామాలలో జ యంతి వేడుకలను నిర్వహించారు.

అన్న ఆశయ సాధనకు కృషి చేద్దాం

ఇంకొల్లు : అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని టీ డీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి పంచారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వా ణిజ్య విభాగ కార్యదర్శి పాలేరు రామకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు గుంజి వెంకట్రావు, వీరగంధం ఆంజనేయులు, పట్టణాద్యక్షుడు మార్క్‌, ముస్లిం మైనార్టీ నాయకులు బాబర్‌బాషా, ఆయోషబుడే, ఆరీఫా, సురేష్‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో శ్రేణుల నివాళి

చినగంజాం : పలు గ్రామాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పొద వీరయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కేట్‌ చేశారు. కార్యక్రమంలో అబ్దుల్‌కలాం అజాద్‌, రాయని ఆత్మారావు, చెరుకూరి రాఘవయ్య, జయరావు, శ్రీనివాసరావు, తాటి రాజశేఖర్‌, నరహరి శ్రీనివాసరావు, తుమ్మలపెంట శ్రీనివాసరావు, జిలాని, పల్లపోలు లక్ష్మీనారాయణ, బాలరాజు, పీ.పార్థసారిఽథి, వడ్లమూడి సత్యనారాయణ, మోమనరావు, శ్రీను, పద్మావతి, రామాంజనేయులు, ప్రయళకావేరి వెంకటేష్‌, షేక్‌.సలాం, శిఖరం సూరిబాబు, టి.చిన్నా, పీ.శ్రీనివాసరావు, ఐటీడీపీ అధ్యక్షుడు రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు.

సంక్షేమానికి ఆధ్యుడు

మేదరమెట్ల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తొలుత ప్రవేశపెట్టిన ఆద్యుడు ఎన్టీఆర్‌ నేతలు కొనియాడారు. ఎన్టీఆర్‌ జ యంతిని రావినూతల, పమిడిపాడు తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. రావినూతలల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే పార్టీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో తెలుగు మహిళలు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. పమిడిపాడులో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - May 28 , 2024 | 10:25 PM

Advertising
Advertising