ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒకటే మాట.. అభివృద్ధే బాట

ABN, Publish Date - Oct 31 , 2024 | 02:43 AM

జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై ఒంగోలులో బుధవారం కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి నియమితులయ్యాక జిల్లా స్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో భేటీ ఆయ్యారు.

కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు

పెండింగ్‌ పనులు.. ఎన్నికల హామీలపై దృష్టి

ప్రణాళికాబద్ధ చర్యలకు ఇన్‌చార్జి మంత్రి ఆనం హామీ

సీఎం దృష్టికి పలు కీలక అంశాలు

4న జరిగే డీఆర్‌సీలో అఽధికారులతో చర్చ

కలెక్టర్‌, ఎస్పీ, జేసీలతో ప్రత్యేకంగా భేటీ

ఆలస్యంగా రావడంతో తొలి పర్యటన గందరగోళం

కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వాటి సహకారంతో అమలుచేసే పథకాలను సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమిలోని మూడు పార్టీల నేతలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. పెండింగ్‌ అభివృద్ధి పనులు, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రత్యేకించి నీటిపారుదల, పారిశ్రామిక, విద్య, వైద్యరంగాల అభివృద్ధిపై దృష్టిసారిద్దామని ఏకాభిప్రాయానికి వచ్చారు. బుధవారం ఎంపీ మాగుంట కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రితో జరిగిన భేటీలో ఈ మేరకు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయా అంశాలపై ప్రణాళికాబద్ధ చర్యలకు, రాజకీయంగా తనకున్న అనుభవాన్ని వినియోగించి జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని ఇన్‌చార్జి మంత్రిగా తొలిసారి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి నేతలకు హామీ ఇచ్చారు.

ఒంగోలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై ఒంగోలులో బుధవారం కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి నియమితులయ్యాక జిల్లా స్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో భేటీ ఆయ్యారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లాకు చెందిన కార్పొరేషన్‌ చైర్మన్లు, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జిల్లాకు ఎన్నికలలో ఇచ్చిన ప్రధాన హామీలు, జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలైన సాగు, తాగునీరు, విద్య, వైద్య, రోడ్డు రవాణా రంగాలతోపాటు పారిశ్రామిక ఉపాధి అంశాలను మంత్రి స్వామి సమావేశంలో ఇన్‌చార్జీ మంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం ఆయా నియోజకవర్గాల వారీ కీలక అంశాలను టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు ఏకరువు పెట్టారు.

పలు అంశాలపై చర్చ

ప్రధానంగా పశ్చిమప్రాంతం వెనుకబాటుతనాన్ని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబులు ప్రస్తావిస్తూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సత్వరం పూర్తి, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు త్వరితగతిన చేయాలని కోరారు. తద్వారా సాగు, తాగునీటి సమస్య తీరడంతోపాటు జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ ఏర్పాటు, ట్రిపుల్‌ ఐటీ నిర్మాణాల ప్రాధాన్యతను ఎమ్మెల్చే ఉగ్రనరసింహారెడ్డి సమావేశం దృష్టికి తీసుకురాగా దొనకొండ కారిడార్‌ అభివృద్ధి, పరిశ్రమ ఏర్పాటుపై దృష్టిసారించాలని దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి కోరారు. గుండ్లకమ్మ పనులు సత్వరం పూర్తి, రామతీర్థం కెపాసిటి పెంపు, గుండ్లకమ్మపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ఇతర అంశాలను ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ ప్రస్తావించగా కొండపి నియోజకవర్గంలో సంగమేశ్వరం నిర్మాణం, తాగునీటి పథకాల ఏర్పాటు అవసరాన్ని మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య వివరించారు. జిల్లాకేంద్రం స్థాయికి అనుగుణంగా ఒంగోలు నగరంలో మరిన్ని హంగులు వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కోరినట్లు సమాచారం. అలాగే సహకార, సాగునీటి సంఘాల ఎన్నికలు ఇతరత్రా పలు అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఒంగోలు ఎంపీ మాగుంట కేంద్రప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న రైల్వేలైన్లు ఇతర ప్రాజక్టుల పనులు త్వరితగతిన పూర్తికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరినట్లు సమాచారం.


సీఎం దృష్టికి సమస్యలు

ఆయా అంశాలపై ఇన్‌చార్జి మంత్రి ఆనం స్పందిస్తూ జిల్లాలో కీలక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు సమన్వయంతో సాగి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రాంతాల వారీ అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై 4వ తేదీన నిర్వహించే డీఆర్సీ సమావేశంలో అధికారులతో చర్చిదిద్దామని, కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిద్దామన్నారు. రాజకీయంగా తనకు ఉన్న అనుభవం, జిల్లాలోని అన్ని ప్రాంతాల పరిస్థితిపై ఉన్న అవగాహనతో జిల్లా అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో నామినెటెడ్‌ పదవులపైనా అందరూ సమన్వయంతో సాగాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, బీజేపీ నేతలు యోగయ్య యాదవ్‌, విజయలక్ష్మి, జనసేన అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎన్నెస్పీ అతిథిగృహానికి వెళ్ళిన మంత్రి ఆనం అక్కడ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఆలస్యం కావడంతో గందరగోళం

ఇన్‌చార్జి మంత్రి ఆనం జిల్లా తొలి పర్యటన కొంత గందరగోళానికి కారణమైంది. నిర్ణీత సమయం కన్నా దాదాపు రెండు గంటలకుపైగా ఆలస్యంగా ఆయన రావడమే ఇందుకు కారణమైంది. ఉదయం 9.30కే మాగుంట ఆహ్వానం మేరకు ముఖ్య నేతలు అక్కడకు రాగా మంత్రి ఆనం 11.15కు వచ్చారు. దీంతో పార్టీ కార్యాలయంలో జరగాల్సిన మీటింగ్‌ మాగుంట కార్యాలయంలోనే నిర్వహించగా మూడు గంటల సమయంలో టీడీపీ ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అనంతరం ఎన్నెస్పీ అతిఽథి గృహానికి వెళ్ళి మళ్లీ ఐదు గంటలకు మాగుంట ఆఫీసుకు చేరి మధ్యాహ్నం భోజనం అప్పుడు చేసి నెల్లూరు వెళ్లగా షెడ్యూల్‌ సరిలేక నేతలు, అధికారులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది.

Updated Date - Oct 31 , 2024 | 02:43 AM