పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:22 PM
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ప్రభత్వు ఆదేశాల మేరకు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పర్చూరులోని వెంకటేశ్వర కాటన్ మిల్‌లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తెలిపారు.
పర్చూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ప్రభత్వు ఆదేశాల మేరకు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పర్చూరులోని వెంకటేశ్వర కాటన్ మిల్‌లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తెలిపారు. పత్తిని సీసీఐ ద్వారా మాత్రమే అమ్ముకోవాలని, ఈక్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. క్విం టా రూ.7,521 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారని సీసీఐ బయ్యర్ అరుణ తెలిపారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఓటీఎ్‌సయూ ప్రసాద్, అసిస్టెంట్ బయ్యర్ అరవింద్, ఏఎంసీ సిబ్బంది సుస్మిత, ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:22 PM