ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేతల ఓవరాక్షన్‌

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:29 AM

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. బాలికపై అత్యాచార ఘటనను తమ రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు నానా హంగామా చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో కేకలు వేస్తూ పోలీసులపై రెచ్చిపోయారు. ఆవేశంతో ఊగిపోయారు.

డీఎస్పీ రాయపాటితో వాగ్వివాదం చేస్తున్న సురేష్‌, వెంకయ్య, అశోక్‌బాబు

పరామర్శ పేరుతో జీజీహెచ్‌లో వీరంగం

సఖీ సెంటర్‌ వద్ద బైఠాయించి నిరసన

పోలీసులపై రెచ్చిపోయిన వెంకయ్య, వరికూటి

రాజకీయ లబ్ధి కోసం నానా అవస్థలు

నిబంధనలకు విరుద్ధంగా బాధితురాలి సందర్శన

ఇబ్బందిపడిన రోగులు, వారి బంధువులు

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. బాలికపై అత్యాచార ఘటనను తమ రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు నానా హంగామా చేశారు. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో కేకలు వేస్తూ పోలీసులపై రెచ్చిపోయారు. ఆవేశంతో ఊగిపోయారు. దళిత మంత్రులైన స్వామి, అనితలపై విమర్శలు చేశారు. ఇళ్లలో తలుపులు వేసుకుని కుర్చున్నారని, ఘటన జరిగి నాలుగు రోజులైనా నేటికీ పరామర్శించలేదన్నారు. ‘వీళ్లు అసలు దళిత మంత్రులేనా? సిగ్గులేదా? దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆరోపించారు. పనిలో పనిగా కలెక్టర్‌, డీఈవోలు ఏంచేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. వారి చేష్టలతో రోగులు, బంధువులు ఇబ్బందులు పడ్డారు.

ఒంగోలు, కార్పొరేషన్‌, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి) : పేదల ప్రభుత్వ ఆసుపత్రి అయిన జీజీహెచ్‌లో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఓ అత్యాచార బాధిత చిన్నారి పరామర్శ పేరుతో ఆసుపత్రిలో ఓవర్‌ యాక్షన్‌ చేశారు. పద్ధతి కాదని నచ్చజెప్పిన పోలీసులపై రెచ్చిపోయారు. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా వినకుండా బాధిత చిన్నారి ఉండే గది వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ సఖీ సెంటర్‌ ఆవరణలో బైఠాయించారు. దీంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. అక్కడ చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడ్డారు. వివరాల్లోకెళితే.. టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక అత్యాచారానికి గురైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సదరు చిన్నారి జీజీహెచ్‌లోని సఖీ కేంద్రంలో వైద్యుల సంరక్షణలో ఉంది. పూర్తి వివరాలతో ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. మహిళా వైద్యుల సంరక్షణలో బాధిత బాలికను ఉంచి వైద్యసేవలు అందిస్తు న్నారు. అయితే పరామర్శ పేరుతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, వైసీపీ నేతలు మాదాసు వెంకయ్య, వరికూటి అశోక్‌బాబు శనివారం తమ అనుచరులతో జీజీహెచ్‌కు చేరుకుని నేరుగా బాలిక ఉండే గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే నిబంధన ప్రకారం అత్యాచారానికి గురైన బాధితుల దగ్గరకు ఇతరులెవ్వరినీ అనుమతించకూడదు. అయితే అందరూ వేరు, మేము వేరు అంటూ వాళ్లతోపాటు మరికొంతమంది వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వారికి నచ్చజెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ఆయనపైనా నోరుపారేసుకున్నారు. గంటసేపు ఆసుపత్రిలో ఓవరాక్షన్‌ చేశారు. డీఎస్పీకి వేలు చూపిస్తూ... నాటకాలాడుతున్నావా? అంటూ వెంకయ్య, వరికూటి అశోక్‌బాబు రెచ్చిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

డీఎస్పీపై ఎదురుదాడి

మాజీ మంత్రి సురేష్‌, వైసీపీ నేతలు వరికూటి అశోక్‌బాబు, మాదాసు వెంకయ్యలు ఒకానొక దశలో అదుపుతప్పి నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్వయంగా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగడం, అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. అత్యాచార ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అయితే ఎవరూ కూడా ఫిర్యాదు ఇవ్వలేదని డీఎస్పీ తెలిపారు. వారి తల్లిదండ్రుల్లో ఒకరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఏమాత్రం వినిపించుకోకుండా గందరగోళం సృష్టించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ చెప్పడంతో ‘నాటకాలు ఆపు, ఏమనుకుంటున్నావు. చట్టాలు మాకు తెలియవా? మేము చదువుకున్నాం’ అంటూ వెంకయ్య రెచ్చిపోయారు. ఇదేక్రమంలో వరికూటి అశోక్‌బాబు తన అనుచరులతో సఖీ కేంద్రంలోకి దూసుకుళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.


బాధిత కుటుంబానికి భరోసా ఏదీ?

సాధారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎవరైనా సరే బాధితులకు అండగా ఉండాల్సిందే. బాధితురాలి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వారి కుటుంబ ప్రతిష్టకు భంగం కలగకుండా సున్నితంగా వ్యవహరించాలి. గతంలో బాపట్ల రైల్వేస్టేషన్‌లో ఓ మహిళపై అత్యాచారం జరగడంతో ఆమెను ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్న స్వామి పరామర్శకు వస్తే పోలీసులు అడ్డుకుని, చట్టప్రకారం వీలు పడదని తెలిపారు. దీంతో స్వామి చట్టాన్ని గౌరవిస్తూ వెనుదిరిగారు. కానీ నేడు పరామర్శ పేరుతో వచ్చిన వైసీపీ నేతలు రాద్ధాంతం చేశారు. చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియను రాజకీయ లబ్ధి కోసం నానా యాగీ చేసిన వారు చివరికి బాధిత కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు.కనీసం ఆర్థికంగా కూడా సహాయపడకుండానే వెనుదిరిగారు. కేవలం కూటమి ప్రభుత్వాన్ని నిందించేందుకు ఈ ఘటన వైసీపీ నేతలకు ఉపయోగపడిందని పలువురు చర్చించుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఘటనలు వాడుకోవడం వైసీపీకి సహజమేనంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం.

Updated Date - Nov 10 , 2024 | 02:29 AM