ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:44 PM

ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అడిషనల్‌ ఎస్పీ బీపీ విఠలేశ్వర్‌ అన్నారు. మండల కేంద్రమైన పంగులూరులో శుక్రవారం రాత్రి అధికారులతో కలసి విఠలేశ్వర్‌ పల్లెనిద్రను చే శారు. ఈ సందర్భంగా ప్రజలతో జరిగిన సమావేశంలో ఏఎస్పీ వారి సమస్యలను తెలుసుకున్నారు.

మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వర్‌

అడిషనల్‌ ఎస్పీ విఠలేశ్వర్‌

పంగులూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అడిషనల్‌ ఎస్పీ బీపీ విఠలేశ్వర్‌ అన్నారు. మండల కేంద్రమైన పంగులూరులో శుక్రవారం రాత్రి అధికారులతో కలసి విఠలేశ్వర్‌ పల్లెనిద్రను చే శారు. ఈ సందర్భంగా ప్రజలతో జరిగిన సమావేశంలో ఏఎస్పీ వారి సమస్యలను తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు, చెడు వ్యసనాలతో ఉన్న వ్యక్తుల సమాచారం తెలుసుకున్నారు. సమాజంలో సైబర్‌ నేరాలు జరిగే తీరును వివరించిన ఏఎస్పీ ప్రజలు వాటిబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. రోడ్డు ప్రమాదాలబారిన పడకుండా పాటించాల్సిన నిబంధనలు, ప్రయాణ సమయంలో హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించాలన్నారు. మహిళలు, చిన్నారులకు పోలీస్‌ రక్షణగా ఉంటుందని, ఎవరైన వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని విఠలేశ్వర్‌ హెచ్చరించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డే వారి సమాచారాన్ని పోలీసులకు, 112 నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ వినోద్‌బాబు, టీడీపీ మండలాధ్యక్షుడు రావూరి రమేష్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:44 PM