ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజాధనం నిరుపయోగం

ABN, Publish Date - Jun 11 , 2024 | 02:15 AM

స్వచ్చ సంకల్పానికి అధికారులు తూట్లుపోడుస్తున్నారు. లక్షలాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.

పొదిలి, జూన్‌ 10 : స్వచ్చ సంకల్పానికి అధికారులు తూట్లుపోడుస్తున్నారు. లక్షలాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. గ్రామీణప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం మానేశారు. పారిశుద్య నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారు. అడపాదడపా కురుస్తున్న వర్షానికి మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. దోమలు విజృంభించి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచిఉందని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక ల్పించిన స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని అధికారులే నిర్వీర్యం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నియ మించిన స్వచ్ఛరాయబారులు సకాలంలో జీతాలు చెల్లిం చక పోవడంతో వారు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్చరాయబారులను నియ మించారు. వారి ద్వారా ఆయా గ్రామాలలో తడిపొడి చెత్తలను సేకరించడం ఎప్పటికప్పుడు పారిశుద్యపనులను చేపట్టాలని తలంచారు. అయితే సకాలంలో వారికి జీత భత్యాలు చెల్లించకపోవడంతో విధుల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పంచాయతీల్లో తడిపొడి చెత్తలను సేకరించేం దుకు ప్రభుత్వం వేలాధిరూపాయలు వెచ్చించి చెత్తరిక్షాలను కొనుగోలు చేశారు. ఆ రిక్షాలను స్వచ్ఛ రాయబారులకు అందజేయకుండా అధికారులు కాలయా పన చేయడంతో ఆ రిక్షాలు నిరుపయోగంగాపడి ఉన్నాయి. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆయా రిక్షాలను ఆరుబైటే ఉంచారు. దీంతో ఎండకు ఎండి వానకు తడిచి తుప్పుపట్టాయి. దీంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆ కార్యాలయానికి నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నప్పటికీ, ఆ రిక్షాల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం తుప్పు పడు తున్న రిక్షాలను ఆయా పంచాయతీలకు అందజేసే చొరవ కూడా చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నా యి. ప్రజాధనం పట్ల చులకభావంతో వ్యవహారిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పులవురు కోరుతున్నారు. ఇప్పటికైనా చెత్తరిక్షాల ద్వారా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి చెత్తసంపద కేంద్రాలకు చేరవేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం రానున్న తరుణంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్యపనులను వేగవంతం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 02:15 AM

Advertising
Advertising