ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:10 AM

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.

పొదిలి, సెప్టెంబరు 19 : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో రెండు నూతన సూపర్‌లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించా రు. ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో ప్రజల కు వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంత దూరమైన పోయే వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడన్నారు. అంతేకాకుండా జిల్లా ఏర్పా టుకు కూడా కట్టుబడి ఉన్నామని త్వరలోనే ముఖ్య మంత్రి ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎం సుందరరావు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు ఓబుల్‌రెడ్డి, కుద్దూస్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఇమాంమ్‌సా, మాజీ సర్పంచ్‌ డాక్టర్‌ స్వర్ణగీత, జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు రసూ ల్‌, శివాలయం మాజీ చైర్మన్‌ సామంతపూడి నాగేశ్వరరావు, నాయకులు సోమయ్య, నరేష్‌, బెల్లంకొండ శ్రీనివాసరావు, రాజ, శ్రీదేవి ఆర్టీసీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

పొదిలి : పట్టణంలో భూ ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయని వాటిని వెలికి తీస్తామని ఎమెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాల య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో భూ భూతాలు ఇష్టా రాజ్యంగా కాలువలు, డ్రైనేజ్‌ స్థలాలను ఆక్రమించి కట్టడా లు కట్టి వ్యాపారాలు చేసుకుంటూ జేబులు నింపుకుంటు న్నాయన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భూ అక్రమా ర్కుల భారీ నుంచి ప్రజలను కాపడతా మన్నారు. వాటిని త్వరలోనే పరిశీలించి ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుడతామన్నారు. రూ.120 కోట్లతో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఫైర్‌స్టేషన్‌, పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పది రోజుల్లో రెండు కోట్ల నిధులతో ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న ఫైర్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టను న్నట్లు తెలిపారు. పట్టణంలో డ్రైనేజ్‌ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్నా వైసీపి ప్రభుత్వం ఐదేళ్ళలో ఒక్కరూపాయి ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తాగునీరు, డ్రైనేజ్‌ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్య క్రమంలో మున్సిపల్‌ కమిష నర్‌ శ్రీనివాసరావు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వరద బాధితులకు విరాళం

మార్కాపురం : విజయవాడ వర ద బాధితుల సహాయార్థం స్థానిక కమలా విద్యాసంస్థల యాజమాన్యం రూ.లక్ష విరాళాన్ని అందించింది. స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని కలిసి గురువారం విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పి.పవ న్‌కుమార్‌ చెక్కును అందించారు. కార్యక్రమంలో అపుస్మా నాయకులు గొట్టం మల్లికార్జున్‌ రెడ్డి, విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్‌ ప్రారంభం

మార్కాపురం : పేదవారి కడుపు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గురు వారం రాత్రి అన్నా క్యాంటీన్‌ ప్రారంభించారు. అనంతరం తొలిరోజు పేదలందరికీ అయ్యే ఆహార పదార్థాల ఖర్చును ఆయనే చెల్లించారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అల్పాహారం, భోజనం అన్నా క్యాంటీన్‌ ద్వారా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లిఖార్జున్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, షేక్‌ మౌలాలి, మాలపాటి వెంకటరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ సాధిక్‌, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:10 AM