వాలీబాల్ జిల్లా జట్టుకు పందిళ్లపల్లి విద్యార్థులు ఎంపిక
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:32 PM
పందిళ్లపల్లి హైస్కూల్ విద్యార్థులు ఇద్దరు వాలీబాల్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. శనివారం త్రోవగుంట జడ్పీ హైస్కూల్‌లో అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలబాలికల జిల్లా జట్టుకు వాయిల వెంకయ్య, వాయిల నందూరావు ఎంపికయ్యారు.
వేటపాలెం(చీరాల), అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి) : పందిళ్లపల్లి హైస్కూల్ విద్యార్థులు ఇద్దరు వాలీబాల్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. శనివారం త్రోవగుంట జడ్పీ హైస్కూల్‌లో అండర్-17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలబాలికల జిల్లా జట్టుకు వాయిల వెంకయ్య, వాయిల నందూరావు ఎంపికయ్యారు. వారిని స్కూల్ హెచ్‌ఎంబీ శేఖరరావు, స్కూల్ మేనేజిమెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ రాంబాబు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
Updated Date - Oct 20 , 2024 | 10:32 PM