ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసు శాఖ ప్రక్షాళన

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:40 AM

పోలీసు శాఖ ప్రక్షాళనకు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ శ్రీకారం పలికారు. కార్యస్థానాలలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిపై చర్యలు తీసుకున్నారు.

దొనకొండ ఎస్సై వీఆర్‌కు

12 మంది ఏఎస్సైలు, 29మంది హెడ్‌ కానిస్టేబుళ్లు బదిలీ

ఒంగోలు క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ ప్రక్షాళనకు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ శ్రీకారం పలికారు. కార్యస్థానాలలో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిపై చర్యలు తీసుకున్నారు. దొనకొండ ఎస్‌ఐ విజయకుమార్‌ దర్శిలో నివాసం ఉంటూ దొనకొండలో పనిచేయడం ఏమిటి అంటూ వెంటనే అతనిని హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వివిధ కారణాలతో 12మంది ఏఎస్‌ఐలు, 29మంది హెడ్‌ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ గురువారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు పైబడిన వారికే స్థానచలనం ఉంటుందని భావించిన పోలీసు సిబ్బందికి ఇలా అకస్మాత్తుగా బదిలీలు జరగడం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయ్యింది. మొత్తం 41 మందిని బదిలీ చేశారు. కాగా ఎందుకు ఇలా జరిగింది అనే చర్చ శాఖలో ప్రారంభమైంది. ఈ బదిలీలలో ఒంగోలులో పనిచేసేవారు ఎక్కువమంది ఉన్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. పశ్చిమ ప్రాంతంలో ఉన్న వారిని ఒంగోలు పరిసర ప్రాంతాలకు బదిలీ చేశారు.

Updated Date - Nov 15 , 2024 | 12:40 AM