జాతీయ స్థాయి తైక్వాండోకు ఎంపికైన రాజుబంగారుపాలెం విద్యార్థి
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:16 PM
రాజుబంగారుపాలెం జల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆట్ల సందీపిక జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైంది. కందుకూరులోని ప్రకాశం ఇంజీనీరింగ్ కళాశాలలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ తైక్వాండో పోటీలలో 41 కేజీల విభాగంలో సత్తాచాటి సందీపిక గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.ఖాలీషావలి తెలిపారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో ప్రతిభ చూపడంతో సందీపికను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
చినగంజాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాజుబంగారుపాలెం జల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆట్ల సందీపిక జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైంది. కందుకూరులోని ప్రకాశం ఇంజీనీరింగ్ కళాశాలలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ తైక్వాండో పోటీలలో 41 కేజీల విభాగంలో సత్తాచాటి సందీపిక గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.ఖాలీషావలి తెలిపారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో ప్రతిభ చూపడంతో సందీపికను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. హర్యానా రాష్ట్రంలో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో సందీపిక పాల్గొనన్నుట్లు తెలిపారు. సందీపిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో మంగళవారం జరిగిన అభినందన సభలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందీపికను హెచ్‌ఎం ఖాలీషావలి, ఉపాఽధ్యాయులు ఆర్‌ఎ్‌సవీ పోతురాజు, ఎస్.అంకయ్య, బి.శ్రీనివాసరావు, పీ.శ్రీలక్ష్మీ, జి.నాగమణి, తైక్వాండో కోచ్‌లు వాటుపల్లి సుబ్రహ్మణ్యం, షేక్ సుల్తాన్‌బాషా, విద్యార్థులు అభినందించారు.
Updated Date - Nov 19 , 2024 | 11:16 PM