ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిధుల ఊరట

ABN, Publish Date - Nov 12 , 2024 | 02:06 AM

నీటిపారుదల రంగంలో జిల్లాలోని రెండు కీలక ప్రాజెక్టులకు ఊరట కలిగేలా కేటాయింపులు జరిగాయి. వెలిగొండ, గుండ్లకమ్మ పనులు వేగంగా సాగేలా నిధులు దక్కాయి. మిగతా రంగాలకూ కేటాయింపులు ఆశాజనకంగానే ఉన్నాయి.

వెలిగొండ మొదటి టన్నెల్‌

వెలిగొండకు రూ.393.50కోట్లు..

గుండ్లకమ్మకు రూ.13కోట్లు

అన్నదాత సుఖీభవకు గ్రీన్‌సిగ్నల్‌

కేంద్రం ఇచ్చే రూ.6వేలకు మరో రూ.14వేలు అదనం

జిల్లాలో 2.45లక్షల మంది రైతులకు లబ్ధి

నీటిపారుదల రంగంలో జిల్లాలోని రెండు కీలక ప్రాజెక్టులకు ఊరట కలిగేలా కేటాయింపులు జరిగాయి. వెలిగొండ, గుండ్లకమ్మ పనులు వేగంగా సాగేలా నిధులు దక్కాయి. మిగతా రంగాలకూ కేటాయింపులు ఆశాజనకంగానే ఉన్నాయి. సోమవారం శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూనే మిగతా రంగాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. రైతులకు అన్నదాత సుఖీభవ ప్రకటించారు. బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని కూటమి నేతలు అంటుండగా.. వైసీపీ, వామపక్షాల నాయకులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి రంగానికి నిధుల ఊరట కలిగింది. రాష్ట్ర బడ్జెట్‌లో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టుకు రూ.393.50 కోట్లు కేటాయింపు జరిగింది. గుండ్లకమ్మకు రూ.13 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి వార్షిక (2024-25) బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రతిపాదించారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేశవ్‌ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేశారు. మొత్తం బడ్జెట్‌లో సుమారు రూ.43వేల కోట్లకుపైగా వ్యవసాయానికి, మరో ప్రాఽఽధాన్యత రంగంగా ఉన్న నీటి పారుదల శాఖకు రూ.16,705కోట్లు కేటాయించారు. అలాగే వివిధ రంగాలకు అవసరాలను బట్టి ప్రకటించారు.

రెండు కీలక ప్రాజెక్టులకు మంచిరోజులు

జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ, వినియోగంలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టులను గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిన విషయం విదితమే. 2023-24లో వెలిగొండకు రూ.101.4 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం కేటాయించగా అందులో కేవలం రూ.26.34కోట్ల మాత్రమే ఖర్చుచేశారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.30కోట్లు కేటాయింపు చేయగా రూ.3.87 కోట్లు ఖర్చుచేశారు. దీంతో వెలిగొండ పనులు ముందుకు సాగలేదు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులకు కూడా నిధులు లేక రెండేళ్లుగా ఆయకట్టుకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండింటిపై దృష్టిసారించింది. వెలిగొండలో రూ.100 కోట్లకుపైగా పనులు ఇప్పటికే చేయగా రూ.80 కోట్ల చెల్లింపులు కూడా జరిగాయి. అందుకు సంబంధించిన నిధులను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి ఇచ్చారు. మరో రూ.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఇటీవల ప్రాజెక్టును ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించి సమీక్ష చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అవకాశం ఉన్న మేర పనులు చేస్తామని వాటికి అవసరమైన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయింపు కనిపించింది.

తక్షణ అవసరాల కోసం..

ఓటాన్‌ బడ్జెట్‌లో ఇచ్చిన నిధులను కూడా కలిపి ఈ ఏడాదికి వెలిగొండకు రూ.393.50 కోట్లు కేటాయింపు చేశారు. అంటే ఇప్పటికే ఖర్చుచేసిన రూ.100 కోట్లు పోను రానున్న నాలుగు నెలలకు మరో రూ.200 కోట్లు ఖర్చుచేసేలా నిధులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం రూ.393.50 కోట్లలో ప్రాజెక్టు పనులకు రూ.248 కోట్లు కేటాయించగా నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు రూ.80కోట్లు, భూసేకరణకు రూ.48కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.16.42 కోట్లు కేటాయించారు. నిర్వాసితుల పునరావాసానికి ఇంకా భారీగా నిధుల అవసరం ఉండగా తక్షణం ప్రాజెక్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు కనుక వచ్చే ఏడాది బడ్జెట్‌లో అందుకు కేటాయింపులు ఉంటాయని అధికారవర్గాల సమాచారం. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గత వైసీపీ ప్రభుత్వం రూ.30కోట్లు కేటాయింపు చేసి రూ.3.87 కోట్లు మాత్రమే ఇవ్వగా ప్రస్తుత బడెట్‌లో తక్షణ అవసరాలకు అనుగుణంగా రూ.13కోట్లు కేటాయించారు. గేట్ల మరమ్మతుల కోసం రూ.6.50 కోట్లు ఇంకా అవసరం కాగా అవి పోను మిగిలిన ఈ నాలుగు నెలల నిర్వహణ ఖర్చులకు ఇబ్బంది లేకుండా చేశారు.

నీటివనరుల అభివృద్ధికి నిధులు

ఒంగోలులోని ప్రాజెక్టుల సీఈ పరిధిలో రాష్ట్రంలో ఎన్‌ఎస్‌పీ కాలువల నిర్వహణ మొత్తం ఉండగా వాటి కోసం రూ.128.62 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎన్‌ఎస్‌పీ కాలువల నిర్వహణ సాగనుంది. ఇక ఇదే సీఈ పరిధిలో మొత్తం జలవనరుల శాఖ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ.31.44కోట్లు, మీడియం ఇరిగేషన్‌, ఇతర పనులకు మరో రూ.6.20 కోట్లు కేటాయించారు. అలా మొత్తంగా ఒంగోలు కేంద్రంగా ఉన్న సీఈ పరిఽధిలో ఈ బడ్జెట్‌లో రూ.581.76 కోట్లు కేటాయింపు జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వంలోని 2023-24లో ఈసీఈ పరిధిలోనూ రూ.301 కోట్లు కేటాయించి రూ.217.39 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు.

రైతులకు భారీ మేలు

ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో జిల్లా రైతాంగానికి భారీగా మేలు జరగనుంది. గతంలో కేంద్రం ఇచ్చే రూ.6వేలకు మరో రూ.7,500 కలిపి ఏడాదికి రూ.13,500ను రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం రూ.20వేలకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. బడ్జెట్‌లో ఆమేరకు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో ఒక్కో రైతుకు అదనంగా ఏడాదికి రూ.6,500 రానుంది. జిల్లాలో మొత్తం 2.45 లక్షలమంది రైతులకు మేలు జరగనుంది. అయితే బడ్జెట్‌ కేటాయింపులపై రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ప్రజారంజకమైన బడ్జెట్‌గా అధికార టీడీపీ అభివర్ణిస్తుండగా... అంకెల గారడీ అని వైసీపీ విమర్శిస్తోంది. ఇతర వామపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

Updated Date - Nov 12 , 2024 | 02:06 AM