ఆక్రమణల తొలగింపు మళ్లీ మొదలు
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:20 AM
మార్కాపురం మునిసిపాలిటీలో ఆక్రమణల తొలగింపును మునిసిపల్ అధికారులు మళ్లీ ప్రారంభించారు. పట్టణంలోని పలుచోట్ల శనివారం వేకువజాము నుంచి మురికి కాలువలపై ఉన్న నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. తొలగింపుల సమయంలో పోగైన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. రీడింగ్ రూం వద్ద నుంచి ప్రారంభ
ప్రధాన వీధిలో తొలగింపునకు
సమయం కోరిన చైర్మన్
వన్ వేప్రారంభించిన పోలీసులు
మార్కాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం మునిసిపాలిటీలో ఆక్రమణల తొలగింపును మునిసిపల్ అధికారులు మళ్లీ ప్రారంభించారు. పట్టణంలోని పలుచోట్ల శనివారం వేకువజాము నుంచి మురికి కాలువలపై ఉన్న నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. తొలగింపుల సమయంలో పోగైన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. రీడింగ్ రూం వద్ద నుంచి ప్రారంభమైన తొలగింపు కార్యక్రమం హర్యానా జిలేబీ దుకాణం వరకూ కొనసాగింది. మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అక్కడకు చేరుకున్నారు. మెయిన్ బజార్‌లో భవన యజమానులే కాలువలపై ఆక్రమణలు తొలగిస్తున్నారని వారికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యంగా కొన్ని పాత నిర్మాణాలు ఉన్నందున ఎక్స్‌కవేటర్ యంత్రాలు తగిలితే అవి కూలిపోయే ప్రమాదం ఉందని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావులకు తెలిపారు. పట్టణంలో ట్రాపిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన ఆక్రమణ లను తొలగించుకోవాలని చైర్మన్ కృష్ణకు తెలిపి ప్రధాన వీధిలో యంత్రాలతో తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు. స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానం వెనుక వైపున ఉన్న దుకాణాలను కూడా పూర్తిస్థాయిలో తొలగించాలని మున్సిపల్ అదికారులు నిర్ణయించారు.
విశ్వేశ్వర థియేటర్ నుంచి రీడింగ్ రూమ్ వరకు వన్ వే
ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా వన్‌వేను కూడా పోలీసుశాఖ శనివారం నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకు గడియార స్తంభం నుంచి దోర్నాల బస్టాండ్ మీదుగా సెవన్‌హిల్స్ వరకు అటు, ఇటు వాహనాలు తిరిగేవి. ప్రస్తుతం గడియార స్తంభం కూడలిలో, చెన్నకేశవస్వామి, అయ్యప్పస్వామి దేవస్థానాల వెనుకవైపు ప్రాంతాలలో పూలు, పండ్లు, ఆకులు అమ్ముకునే దుకాణాలు, తోపుడు బండ్లతో ట్రాపిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి. పట్టణంలోకి వచ్చే బస్సుల్లోంచి దాదాపు చాలామంది తోపుడు బండ్లతో ట్రాపిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి. పట్టణంలోకి వచ్చే బస్సుల్లోంచి దాదాపు చాలామంది గడియారస్తంభం వద్దనే దిగుతుంటారు. ఈ ఇబ్బందులను తొలగించడానికి వన్‌వేను ఏర్పాటు చేశారు. కళాశాల రోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చే వాహనాలు సెవెన్ హిల్స్ నుంచి విశ్వేశ్వర థియేటర్ మీదుగా రాధాకృష్ణ టాకీస్, తూర్పువీధి జువ్విచెట్టు, శివాలయం ఆర్చీ, రథం బజార్, విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి రాజాజీ వీధిలోకి ప్రవేశించి రీడింగ్ రూమ్ వద్దకు వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మధ్యలో ఎక్కడా వాటికి ఎదురు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పట్టణం నుంచి కళాశాల రోడ్డువైపు వెళ్లే వాహనాలు దోర్నాల బస్టాండ్, శాంతిక్లినిక్, సప్తగిరి లాడ్జీ మీదుగా బయటకు వెళుతున్నాయి. ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకుండా రహదారికి ఇరువైపులా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో ఉంచడంలాంటి చర్యలు చేపడుతున్నట్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వన్‌వే కీలకం కానుందని ఆయన అన్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా పట్టణ శ్రేయస్సు మేరకు మార్పులు తప్పవన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:20 AM