టీడీపీ సభ్యత్వనమోదుకు స్పందన
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:10 AM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొప్పెరపాడు టీడీపీ నేతలు స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు వి.కొప్పెరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గ్రామ కూడలీలో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఒక్కరోజే గ్రామానికి చెందిన 250 మంది కార్యకర్తలుగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.
ఒక్కరోజే 250 మంది స్వీకరణ
బల్లికురవ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొప్పెరపాడు టీడీపీ నేతలు స్పెషల్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు వి.కొప్పెరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గ్రామ కూడలీలో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఒక్కరోజే గ్రామానికి చెందిన 250 మంది కార్యకర్తలుగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. టీడీపీ సభ్యత్వ నమోదు తీసుకున్న వారు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.5లక్షల బీమా అందిస్తుందని నాయకులు అవగాహన కల్పించారు. మరో రెండు రోజుల పాటు ఈ డ్రైవ్ ఉంటుందని చెప్పారు. 900 మంది చేరికే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు నాయకులు నాగినేని సాంబశివరావు, కామినేని శ్యామలరావు, షేక్ అబ్దుల్సాహెబ్, పరిటాల పవన్, పూరేటి రామకృష్ట, మక్కెన ప్రసన్న కుమార్, ప్రసాద్, శ్రీనివాసరావు, ఖాజావలి, బాలయ్య, వరదయ్య పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:10 AM