ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిలావస్థలో ఆర్టీసీ బస్టాండ్‌

ABN, Publish Date - Nov 07 , 2024 | 09:55 PM

పర్చూరు ఆర్టీసీ బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుకుంది. భవనం దెబ్బతిని పెచ్చులు ఊడి ప్రయాణికులపై పడుతున్నాయి. అ యినా పట్టించుకునేవారే లేరని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం బస్టాండ్‌లో నిరీక్షించే సమయం లో ఏం ప్రమాదం జరుగుతోందోనని వారు భయపడుతున్నారు. ఇక్కడ విద్యుత్‌ సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. తరచూ మరమ్మతులతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.

కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ ( పెచ్చులూడిన స్లాబు)

భవనం నుంచి ఊడుతున్న పెచ్చులు

కంపుకొడుతున్న మురుగు నీరు

ప్రాంగణంలో పెరిగిన ముళ్ల చెట్లు

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

పర్చూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : పర్చూరు ఆర్టీసీ బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుకుంది. భవనం దెబ్బతిని పెచ్చులు ఊడి ప్రయాణికులపై పడుతున్నాయి. అ యినా పట్టించుకునేవారే లేరని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం బస్టాండ్‌లో నిరీక్షించే సమయం లో ఏం ప్రమాదం జరుగుతోందోనని వారు భయపడుతున్నారు. ఇక్కడ విద్యుత్‌ సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. తరచూ మరమ్మతులతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆవరణలో ముగురు నీరు నిలిచి తీవ్రమైన కంపు కొడుతోంది. ప్రాంగణం చుట్టూ ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. రాత్రి సమయాల్లో అ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి స మయాల్లో వచ్చిపోయే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పర్చూరు నియోజకవర్గ కేంద్రంతోపాటు, చుట్టు పక్కల ప్రధాన పట్టణాలకు కూడలి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు పర్చూరు మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంది. దీంతో ప్రతి వాహనం బస్టాండ్‌ నుంచే రాకపోకలు చేయాల్సి ఉంది. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన వారు ఆర్టీసీ బస్టాండ్‌కు రావలిసిందే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ కూలేందు కు సిద్ధంగా ఉన్నా సంబంధిత అధికారులు మౌనంగా ఉండడం పై ప్రయాణికులు, ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. మరోప క్క దీనికి చెందిన స్థలం కూడా ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు.

వైసీపీ పాలనలో నిర్లక్ష్యం

వైసీపీ పాలనలో ఆర్టీసీ బ స్టాండ్‌ నిర్వహణ గాలికి వదిలేశారు. భవనం పెచ్చులూడి ప్ర యాణికులు గాయపడుతున్నా కనీసం మరమ్మతులు కూడా చే యలేదని, పూర్తి నిర్లక్ష్యానికి గురైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరుగుదొడ్లు అధ్వానం

దూర ప్రాంతాల నుంచి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు కనీస వసతలు కూడా లేవు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల పరిస్థితి దయనీయంగా మారింది.

Updated Date - Nov 07 , 2024 | 09:55 PM