రేపు వాడరేవులో సాగర హారతి
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:21 PM
విజయవాడలో ఈ నెల 15వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం సభకు సన్నాహంగా చీరాల మండలం వాడరేవు సముద్రతీరంలో ఆంజనేయస్వామి విగ్రహం ఎదురు రేపు సామూహిక సాగర హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో చీరాల ప్రాంతంలో తొలిసారిగా సామూహిక సాగర హారతి కార్యక్రమానికి శ్రీకారం పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం చీరాల గడియారస్తంభం సెంటర్లోని వీరరాఘవస్వామి దేవస్థానం వద్ద అందుకు సంబంధించిన కరపత్రాలను అన్నదానం చిదంబరశాస్త్రి తదితరులు ఆవిష్కరించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల
ప్రాంతంలో తొలిసారిగా కార్యక్రమం
హిందూ చైతన్యవేదిక వేదిక
ఆధ్వర్యంలో హైందవ శంఖారావం
గడియార స్తంభం సెంటర్లో
వీరరాఘవస్వామి ఆలయం వద్ద
కరపత్రాల ఆవిష్కరణ
చీరాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో ఈ నెల 15వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం సభకు సన్నాహంగా చీరాల మండలం వాడరేవు సముద్రతీరంలో ఆంజనేయస్వామి విగ్రహం ఎదురు రేపు సామూహిక సాగర హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో చీరాల ప్రాంతంలో తొలిసారిగా సామూహిక సాగర హారతి కార్యక్రమానికి శ్రీకారం పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం చీరాల గడియారస్తంభం సెంటర్లోని వీరరాఘవస్వామి దేవస్థానం వద్ద అందుకు సంబంధించిన కరపత్రాలను అన్నదానం చిదంబరశాస్త్రి తదితరులు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి గత సోమవారం రాత్రి వాడరేవు సముద్ర తీరంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా పండితులు, భక్తులు సాగర హారతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అ త్యంత నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో, నిర్వహించారు. శ్రీ కామాక్షికేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజ్, బండారు జ్వాలానరసింహం, భజన మండలి మహిళలు, వేద పండితులు కారంచేటి నగే్‌షకుమార్, వెంకటే్‌ష ముందుగా శాస్త్రోక్తంగా శివపార్వతుల పూజ అనంతరం సాగర హారతికి సంకల్పం పలికారు. ఆ క్రమంలో తొలిసారిగా సాగరహారతి కార్యక్రమం జరగనుండడంతో భక్తు లు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం వాడరేవు తీ రంలో 4 గంటల నుంచి భజన కార్యక్రమా లు ప్రారంభమవుతాయి. పంచామృతాలతో స్పటిక శివలింగానికి అభిషేకాలు, మంత్రపుష్పం అనంతరం శాస్త్రోక్తంగా సాగరహారతి కార్యక్రమాలు కనులపండువగా జరగుతాయ ని నిర్వాహకులు తెలిపారు. కులాలకు అతీతంగా అందరూ కార్యక్రమంలో పాల్గొని జ యప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తడవర్తి చంద్ర, దిట్టకవి వాసుదేవాచార్యులు, సర్విశెట్టి సుబ్బరామయ్య, డాక్ట ర్ శబరి, గోలి మల్లికార్జున పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 11:21 PM