ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ భవనాలకు మోక్షం ఎప్పుడో?

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:58 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో విచ్చలవిడిగా గ్రామాలలో ప్రభుత్వ భవనాలకు రూ.కోట్ల నిధులను మంజూరు చేశారు. కానీ ఎక్కడా నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. పలు గ్రామాలలో ఏళ్ల తరబడి అలానే అసంపూర్తి పనులతో ప్రభుత్వ భవనాలు నిర్మాణం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రజా నిధులు పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముక్తేశ్వరంలో పిల్లర్ల దశలోనే నిలిచిన రైతు సేవా కేంద్రం

అసంపూర్తి పనులతో నిలిచిన కట్టడాలు

ఏళ్ల తరబడి గ్రామాలలో ఇదే పరిస్థితి

కొన్ని శిథిలావస్థకు

నిధులు వృథా చేస్తున్నారని ప్రజల అసహనం

బల్లికురవ. నవంబరు 6 (ఆంరఽధజ్యోతి) : ఐదేళ్ల వైసీపీ పాలనలో విచ్చలవిడిగా గ్రామాలలో ప్రభుత్వ భవనాలకు రూ.కోట్ల నిధులను మంజూరు చేశారు. కానీ ఎక్కడా నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. పలు గ్రామాలలో ఏళ్ల తరబడి అలానే అసంపూర్తి పనులతో ప్రభుత్వ భవనాలు నిర్మాణం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రజా నిధులు పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో గతంలో వైసీపీ హయాంలో పెత్తనం చేసిన కొందరు భవనాలను కొంత మేర నిర్మాణం చేపట్టి వచ్చిన వరకు బిల్లులు డ్రా చేసుకొని భవనాలను పూర్తి చేయకుండా వదిలేశారని ఇప్పుడు ఆ భవనాలను ఎవరు పూర్తి చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పట్లో అసంపూర్తి పనులతో ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు లేవని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేసు మట్టం వేసి మట్టి బిల్లులు వచ్చే వరకు పనులు చేపట్టి నిధులను కాజేశారని అరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాలలో ఊరికి దూరంగా భవనాలను ఏర్పాటు చేయడం కూడా కొంత జాప్యం జరగడానికి కారణమని వారు అంటున్నారు.

బల్లికురవ మండలంలోని 20 గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న గ్రామాలకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాలకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో గత మూడేళ్ల కాలం నుంచి గ్రామాలలో భవనాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో సచివాలయ భవనానాకి రూ.43లక్షలు, రైతు భరోసా కేంద్రానికి రూ.24లక్షలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు రూ.20లక్షల చొప్పున నిధులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో వైసీపీ చోటా నేతలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భవనాలను నిర్మాణం చేపట్టారు. కొందరు బేసు మట్టం వేసి మట్టి బిల్లులు పొంది తదుపరి పనులను నిలిపి వేవారు. కొందరు కప్పు వరకు వేసి అలానే వదిలి వేశారు. కొందరు పిల్లర్ల దశ వరకు పనులు చేపట్టి అఝ్కడకు వచ్చిన వరకు బిల్లులను పొంది పను లు పూర్తి చేయకుండా వదిలి వేశారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ భవనాల నిధులు పక్క దారి పట్టాయని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నిసార్లు భవనాల అసంపూర్తి పనులు పూర్తి చేయాలని అధికారులు పనులు మెదలు పెట్టినా, వారితో చెప్పినా ఎవరు పట్టించుకోక పోవడం వలనే అన్ని గ్రామాలలో భవన నిర్మాణాలు పూర్తి కాకుండా ఉన్నాయి. బల్లికురవ మండలంలోని కొత్తూరులో రైతు భరోసా కేంద్రం, పిల్లర్ల దశలోనే ఉంది. అలానే ముక్తేశ్వరం అర్‌బీకే భవనం పిల్లర్ల దశలోనే శిథిలావస్థకు చేరింది. విలేజ్‌ హెల్త్‌ భనవం ప్లాస్టింగ్‌ వరకు వచ్చి ఉంది. వెలమవారిపాలెంలో సచివాలయం భవనం 80 శాతం పూర్తి కాగా ఆర్‌బీకే భవనం పిల్లర్ల దశలోనే ఉంది. కూకట్లపల్లిలో సచివాలయం, ఆర్‌బీకే భవనాలు కప్పు దశలోనే ఉన్నాయి. కొణిదెనలో సచివాలయం, ఆర్‌బీకే భవనాలు 70శాతం పనులు పూర్తయి ఉన్నాయి. సోమవరప్పాడులో ఆర్‌బీకే స్లాబు వరకు రాగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పిల్లర్ల దశలోనే ఉంది. వల్లాపల్లిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం స్లాబు పూర్తి అయి ఉంది. చెన్నుపల్లిలో సచివాలయం, ఆర్‌బీకే భవనాలు 80 శాతం పూర్తయి పనులు నిలిచి ఉన్నాయి. ఎస్‌ఎల్‌ గుడిపాడులో సచివాలయం, ఆర్‌బీకే భవనాలు పిల్లర్ల దశలోనే పనులు నిలిచి ఉన్నాయి. బల్లికురవలో కోర్టు కేసులతో సచివాలయం, ఆర్‌బీకే భవనాలు బేసు మట్టం దశలో పనులు నిలిచి ఉన్నాయి. అలానే మరి కొన్ని గ్రామాలలో అరకొర పనులు పూర్తి కాక పోవడంతో ప్రభుత్వ భవనాలు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ప్రభుత్వ భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా అసంపూర్తి భవనాలపై దృష్టి పెట్టలేదని వెంటనే అన్ని గ్రామాలలో పనులు నిలిచి ఉన్న ప్రభుత్వ భవనాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:58 PM