ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు

ABN, Publish Date - Aug 18 , 2024 | 10:18 PM

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ జిల్లా పంచాయతీ అధికారి, జి ల్లా వైద్యశాఖ అధికారులతో ఆదివారం ఫోన్‌లో ఆదేశించారు.

జ్వరాలున్న చోట వైద్య శిబిరాలు నిర్వహించండి

అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి

అద్దంకి, ఆగస్టు 18 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ జిల్లా పంచాయతీ అధికారి, జి ల్లా వైద్యశాఖ అధికారులతో ఆదివారం ఫోన్‌లో ఆదేశించారు. గ్రామాల లో దోమలవ్యాప్తి ఎక్కువగా ఉండి డెంగ్యూ, టైఫాయిడ్‌ తదితర జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గొట్టిపాటి అన్నారు. విషజ్వరాలబారిన పడిన ప్రజలు ప్రైవేటు వైద్యశాలకు వెళ్లలేక ఆర్‌ఎంపీల వద్దే వైద్యం చేయించుకుంటున్నారన్నారు. గ్రామాలలో ప్రతి రోజూ విధిగా పారిశుధ్య పనులు, ఫాగింగ్‌ చేపట్టాలన్నారు. విషజ్వరాలకు సం బంధించిన మందులు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేం ద్రాలలో ఉండేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలను ఏర్పా టు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 18 , 2024 | 10:18 PM

Advertising
Advertising
<