ఆసక్తిగా చీరాల మున్సిపల్ కౌన్సిల్
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:17 AM
మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి పలువురు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అజెండాలోని అంశాలపై చర్చ కన్నా ఛలోక్తులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 11.25 గంటలకు ప్రారంభమయింది. ఈ క్రమంలో కౌన్సిలర్ సత్యానందం చైర్మన్ రావడంలో నెలకొన్న జాప్యంపై అసహనం వక్తం చేశారు. చైర్మన్ 11.25 గంటలకు రాగా సమావేశం ప్రారంభమైంది.
సమావేశానికి పలువురు కౌన్సిలర్లు గైర్హాజర్
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబరుగా న్యాయవాది రుద్రకుమార్ పేరు ఆమోదం
ఫలించిన ఎమ్మెల్యే కొండయ్య వ్యూహం
చీరాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి పలువురు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అజెండాలోని అంశాలపై చర్చ కన్నా ఛలోక్తులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 11.25 గంటలకు ప్రారంభమయింది. ఈ క్రమంలో కౌన్సిలర్ సత్యానందం చైర్మన్ రావడంలో నెలకొన్న జాప్యంపై అసహనం వక్తం చేశారు. చైర్మన్ 11.25 గంటలకు రాగా సమావేశం ప్రారంభమైంది. అజెండాలోని 19 అంశాలలో మొదటి అంశం వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని వాయిదా వేశారు. ఆ అంశాన్ని ముందస్తుగా ఎమ్మెల్యే కొండయ్య దృష్టికి తీసుకెళ్లాలని కౌన్సిలర్ సత్యానందం చెప్పారు. ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి ముందుగానే తీసుకెళ్లారని కౌన్సిలర్ మామిడాల రాములు చెప్పారు. మిగిలిన 18 అంశాలలో ఒకటైన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబరుగా న్యాయవాది బొడ్డు రుద్రకుమార్ పేరును ఆమోదించారు. మిగిలిన 17 అంశాలను ఏక వాక్యంతో ఆమోదించారు. అత్యవసర అంశంగా పెట్టిన నగదు చెల్లింపు అంశాన్ని కొద్దిపాటి చర్చతో ఆమోదించారు.
ఫలించిన ఎమ్మెల్యే కొండయ్య వ్యూహం
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబరుగా న్యాయవాది బొడ్డు రుద్రకుమార్ పేరును ఆమోదింపచేయడంలో ఎమ్మెల్యే వ్యూహం ఫలించిం ది. కౌన్సిల్‌లో మొత్తం 33 మంది (చైర్మన్‌తో కలిపి) కాగా, టీడీపీకి 14 మంది సంఖ్యాబలం మాత్రమే ఉంది. వైసీపీకి అదే సంఖ్యాబలం ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గంగా ఐదుగురు కౌన్సిలర్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కౌన్సిల్‌కు సంబంధించి ఓటింగ్ జరిగితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే కొండయ్య సూచనల మేరకు టీడీపీతో జతకట్టిన కౌన్సిలర్లు అందరూ సమావేశానికి హాజరయ్యారు. ఆమంచివర్గంలో కొందరు, వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఓటింగ్ జరిగితే టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన పేరు నెగ్గుతుంది. అయితే విషయం కౌటింగ్ వరకు వెళ్లకుండా కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, సత్యానందం ప్రతిపాదించగా, కౌన్సిలర్ ఉల్లిపాయల సుబ్బయ్య బలపరిచారు. మిగిలినవారు మద్దతు తెలిపారు. దీంతో స్టాండింగ్ కౌన్సిల్ పేరు ఏకగ్రీవమైంది. దీంతో టీడీపీ తమ సత్తా చాటుకున్నట్లయింది. ఎమ్మెల్యే కొండయ్య వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో చైర్మన్‌తో సహా అందరికీ వారివారి ప్రాధాన్యత లభించినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Updated Date - Oct 31 , 2024 | 12:17 AM