ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముప్పాళ్లపాడు సొసైటీపై సెక్షన్‌ 51 విచారణ

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:27 AM

హను మంతునిపాడు మండలం ముప్పాళ్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘంపై విచారణకు జిల్లా సహకారాధికారి బి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. విచారణాధికారిగా కనిగిరి ఇన్‌చార్జి ఎస్‌డీఎల్‌సీవో థామస్‌ను ని యమించారు

విచారణాధికారి కనిగిరి ఎస్‌డీఎల్‌సీవో థామస్‌

ఒంగోలు (విద్య), సెప్టెంబరు 20 : హను మంతునిపాడు మండలం ముప్పాళ్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘంపై విచారణకు జిల్లా సహకారాధికారి బి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. విచారణాధికారిగా కనిగిరి ఇన్‌చార్జి ఎస్‌డీఎల్‌సీవో థామస్‌ను ని యమించారు. సొసైటీలో జరిగిన నిధుల దుర్వి నియోగం, ఆర్థిక అక్రమాలు, అవకతవకలపై ఆంధ్రప్రదేశ్‌ సహకార సం ఘాల చట్టం 1964 సెక్షన్‌ 51 ప్రకారం సమగ్ర విచారణ నిర్వహిం చి రెండు నెలల్లో విచారణ నివేదికను సమర్పిం చాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ముప్పాళ్ల పాడు సొసైటీలో భారీగా అవకతవకలు జరిగి నట్లు పీడీసీసీ బ్యాంకు కనిగిరి శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ డి.కార్తీక్‌ బ్యాంకు సీఈవోకు, ప్రత్యేకా ధికారికి నివేదిక సమర్పించారు. దీనిపై విచార ణకు ఆదేశించాలని బ్యాంకు సీఈవో కోటిరెడ్డి డీసీవోకు సిఫార్సు చేశారు. దీనిపై ఏపీ సహకా ర సంఘాల చట్టం కింద విచారణ నిర్వహిం చేందుకు బ్యాంకు సీఈవోకు డీసీవో అనుమ తించారు. ముప్పాళ్లపాడు సొసైటీకి సంబంధిం చి 2023-24 సంవత్సరానికి ఆడిట్‌ నిర్వహించి న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కె.వెంకటేశ్వర్లు ప్రత్యేక నివేదికను ఇటీవల డీసీఏవో రాజశేఖర్‌కు స మర్పించారు. అందులో సొసైటీలో భారీ అక్ర మాలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. సొసై టీ ద్వారా బట్వాడా చేసిన రూ.1.68 కోట్లకు స ంబంధించి 258 బాండ్లు మాయమయ్యాయని, మరో 1,299 బాండ్లకు కాలం తీరిందని పేర్కొ న్నారు. అదేవిధంగా లక్షలాది రూపాయలు వి విధ మార్గాల్లో దుర్వినియోగమయ్యాయని స్పష్టం చేశారు. దీంతో ఈ సొసైటీపై సెక్షన్‌ 51 ప్రకారం విచారణకు ఆదేశించాలని ఒంగోలు డీఎల్‌సీవో రాజశేఖర్‌ డీసీవోకు సిఫార్సు చేశా రు. ఈనేపథ్యంలో ఈ సొసైటీపై మొదట ఆ దేశించిన సెక్షన్‌ 53 విచారణను రద్దుచేశారు. సెక్షన్‌ 51 కింద విచారణకు ఆదేశిస్తూ డీసీవో శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:27 AM