ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:25 AM

దసరా శరన్నవరాత్రులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

త్రిపురాంతకం, అక్టోబరు 3: దసరా శరన్నవరాత్రులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఆలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి మంగళవాయిద్యాలు, అభిషేకాలు, ప్రాతఃకాలపూజ, గణపతిపూజ, అఖండ స్థాపన, సప్తశతి పారాయణం, మండపారాధన, పల్లకిసేవ, బాలపూజ, ప్రదోష కాలపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు దూపాటి పాలంక ప్రసాదశర్మ, విశ్వన్నారాయణశాస్త్రి, వేదపండితులు ఫణీంద్రకుమార్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంకురార్పణ పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకీలో ఆలయ ఉత్సవం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎరిక్షన్‌బాబుకు అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అమ్మవారి పల్లకి సేవలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పాలకమండలి సభ్యులు, ఉభయ దాతలు పాల్గొన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు.

శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

త్రిపురాంతకం : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మొదటిరోజు శ్రీబాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. అమ్మవారు శుక్రవారం బ్రహ్మచారిణిదేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

పెద్ద దోర్నాల :స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో, తిమ్మాపురం గ్రామంలోని శ్రీచౌడేశ్వరీ దేవాలయంలో, మోట్ల మల్లికార్జున స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్క రించుకునిశరన్నవరాత్రుల ఉత్సవా లను గురువారం ప్రారంభిం చారు.ఆయా ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా స్థానిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాల యంలో మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు బిదరే రాంప్రసాద్‌శర్మ శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ రూపంలో అలంకరించారు. మోట్ల మల్లికార్జున స్వామి దేవాలయం లో ఆలయ అర్చకులు అశ్వనీకుమార్‌ అమ్మవారిని కవచలంకృత భ్రమరాంభికాదేవి అలంకారంలో, తిమ్మా పురంలోని చౌడేశ్వరీ దేవాలయంలో మణిశర్మ అమ్మవారు బాలత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. గీతాలా పనలతో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదం పంపిణీచేశారు.

కంభం : కంభం వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 3న గురువారం నుంచి దసర శరన్నవరాత్రులు ప్రారంభమైనట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. 3 నుంచి 14వ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమి స్తారన్నారు. 3న గురువారం వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అలంకరణ 4న అన్నపూర్ణదేవి, 5న భువనేశ్వరిదేవి, 6న రాజరాజేశ్వరిదేవి, 7న గజలక్ష్మీదేవి, 8న పార్వతిదేవి, 9న సరస్వతిదేవి, 10న దుర్గాదేవి, 11న మహంకాళిదేవి, 12న విజయలక్ష్మీదేవి, 13న మహిషాసుర మర్ధిని అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారన్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాజరాజేశ్వరిదేవిగా అలంకరణ

గిద్దలూరు : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవస్థానంలో అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ పతాక ఆవిష్కరణ చేసి నవరాత్రులను ప్రారంభించారు. వందలాది మంది మహిళలు సామూహికంగా గంగా జలంతో వచ్చి అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ముత్తైదువులు కళశాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన కమిటీ ప్రతినిధులు ఆయా పూజా కార్యక్రమా లలో పాల్గొన్నారు. అంకాలమ్మ దేవాలయంలో, సాయి బాబా మందిరంలో, కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. షరాఫ్‌ బజారులో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా బ్రహ్మోత్స వాలు ప్రారంభం కాగా తొలి రోజు స్వామి విష్ణుమూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, హోమం, పూలంగిసేవ, పవలింపు సేవ కార్యక్రమాలను నిర్వహించారు.

పుల్లలచెరువు : పుల్లలచెరువులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలోని అమ్మవారి మొదటి రోజు శ్రీస్వర్ణ కవచంకృత అమ్మవారిగా దర్శనం ఇచ్చారు. గురువారం పుల్లలచెరువులో దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా మహగణపతి పూజ, పుణ్యవాచనము, అఖండ ద్వీప ప్రజ్వలన, శ్రీ చ్రక యంత్ర అధిష్టాన దేవతలకు పంచాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రులు మార్కాపురం పట్టణంలో వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మార్కాపురంలోని లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు రాజ్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవిమాతగా, శివాలయంలో జగదాంబ శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు.

మార్కాపురం రూరల్‌ : మండలంలోని జమ్మనపల్లి గ్రామ ఇలాకాలోని ముద్దసానమ్మ ఆలయంలో దసరా నవరాత్రులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యా యి. నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్బంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. గురువారం నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రుల సందర్బంగా ప్రతి రోజు నివేదన హారతులతో పాటు చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్హాకులు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం సువాసిని పూజ అనంతరం సాంస్కృ తిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 01:25 AM