ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూలీల కొరత..నీటి ఎద్దడి

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:48 PM

మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి సాగు చేసిన రైతులకు ఒక వైపు కూలీల కొరత ఏర్పడడంతో తోటలోనే కాయలు ఎండి పోతున్నాయి. మరో వైపు నీటి ఎద్దడి కారణంగా తోటలు వాడుముఖం పడుతున్నాయి. దీంతో మిర్చి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను దక్కించుకునేందుకు రైతులు ఇళ్ల దగ్గర నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళ్లి మిర్చి తోటల్లో ఉన్న నీటి కుంటలను నింపుకుంటున్నారు.

ట్యాంకర్‌ నీటిని తొట్టిలో నింపుతున్న రైతులు

ట్యాంకర్ల ద్వారా మిరప చేలకు నీరు

మిర్చి రైతులకు నష్టం

ముండ్లమూరు, మార్చి 16 : మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి సాగు చేసిన రైతులకు ఒక వైపు కూలీల కొరత ఏర్పడడంతో తోటలోనే కాయలు ఎండి పోతున్నాయి. మరో వైపు నీటి ఎద్దడి కారణంగా తోటలు వాడుముఖం పడుతున్నాయి. దీంతో మిర్చి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను దక్కించుకునేందుకు రైతులు ఇళ్ల దగ్గర నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళ్లి మిర్చి తోటల్లో ఉన్న నీటి కుంటలను నింపుకుంటున్నారు. తద్వారా తోటలను తడుపుకుంటున్నారు. మిర్చి పంటలకు వరుస తెగుళ్లు రావడంతో దిగుబడి గణనీయంగా పడి పోయింది. వచ్చిన దిగుబడి సైతం కోసేందుకు కూలీల డిమాండ్‌ కూడా ఏర్పడింది. చేలోనే కాయలు ఎండి పోయే పరిస్థితి వచ్చింది. వారం రోజులుగా నీటి ఎద్దడి ఏర్పడింది. మండలంలోని తమ్మలూరు, నాయుడుపాలెం, ఉమా మహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, మారెళ్ల, సుంకరవారిపాలెం, నూజెండ్లపల్లి, భట్లపల్లి, శంకరాపురంలలో ఎక్కువగా మిర్చిని సాగు చేశారు. తమ్మలూరులో మిర్చి తోటలకు పూర్తిగా నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా వ్యవసా య బోరులో నీరు నిలిచి పోవడంతో రైతులు చేసేదిలేక ఇళ్ల దగ్గర నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళ్లి కుంటలకు పెట్టి ఆ తరువాత తోటలకు నీరు పెడుతున్నారు. మండలంలో ఖరీఫ్‌, రబీ కలుపుకొని 5,400 ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక వైపు కూలీల కొరత, మరో వైపు నీటి ఎద్దడి మిర్చి రైతులను నష్టాల్లో ముంచింది.

Updated Date - Mar 16 , 2024 | 11:48 PM

Advertising
Advertising