విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:18 AM
వసతిగృహాల్లో చదువుకునే విద్యార్థులు సము న్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లో చదువుకునే విద్యార్థులు సము న్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో సోమవారం సాయంత్రం విద్యార్థినులకు దుప్ప ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. చిన్న వయస్సులోనే సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల న్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి ఫలితంగానే 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాదించారన్నారు. అలాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నా రు. చదువులో ఉత్తమం గా రాణించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని అన్నారు. సబ్‌కలెక్టర్ వెంక ట్ త్రివినాగ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థి నులు శ్రమిస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దన్నారు. విద్యార్థి దశలో కష్టపడితే భావిజీవితం పూలబాటగా మారుతుందన్నారు. ఈ విద్యార్థునులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యువో అరుణకుమారి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, మైనార్టీ నాయకులు ఇబ్రహీం, యువత నాయకులు దొడ్డా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 12:18 AM