ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గిద్దలూరులో టీడీపీదే గెలుపు

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:09 AM

గిద్దలూరు నియోజక వర్గంలో ఈ సారి టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గిద్దలూరు టౌన్‌, మార్చి 26 : గిద్దలూరు నియోజక వర్గంలో ఈ సారి టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరవ పంచాయతీ పరిధిలోని బయనపల్లె గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు మీసాల పాపయ్య ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న అనేక మందికి పథకాలు అందలేదన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రచారంలో ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసింది మరోకటని విమర్శించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో మీసాల రమేష్‌ యాదవ్‌, వెలిదండ్ల బాలరంగారెడ్డి, బోయిళ్ల పోలిరెడ్డి, చింతకుంట్ల పీరయ్య, వీరమాసి భాస్కర్‌, దిబ్బగాండ్ల కాశన్న, కౌలూరి పెద్దకాశన్న, దుగ్గెపోగు చిన్నరంగయ్య, కోవెలకుంట్ల జమాలయ్య, బద్దెల రాజబాబు, బాబు, వీరమాసి పెద్దభాస్కర్‌, దుగ్గెపోగు దావీద్‌, బుజ్జి, దానం, లక్ష్మయ్య, ఆమడాల వసంత్‌, పోలిరెడ్డి, నరసింహులు, తదితరులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు బాబాయ్‌, జయరామిరెడ్డి, పందన బోయిన నారాయణయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:09 AM

Advertising
Advertising