దర్శిలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత
ABN, Publish Date - Oct 29 , 2024 | 11:26 PM
దర్శి పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన సంఘటన కలకలం రేగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఎవరో కోసి చించివేశారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుతమ్ముళ్లు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దర్శి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి) : దర్శి పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన సంఘటన కలకలం రేగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఎవరో కోసి చించివేశారు. విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలు చించారని అనుమానిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా దర్శి పట్టణంలోని గడియారస్తంభం సెంటర్, ప్రధాన రహదారుల్లో టీడీపీ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ వాటిని వేశారు. దర్శి-కురిచేడు రోడ్డులో డివైడర్లపై పెట్టిన తొమ్మిది ఫ్లెక్సీలను సోమవారం రాత్రి కోసి చించివేశారు. మంగళవారం ఉదయం చూసే సరికి చించి ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందుకు బాధ్యులెవరు అన్న విషయంపై దృష్టి సారించి విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Oct 29 , 2024 | 11:49 PM