ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇతర జిల్లాల తహసీల్దార్లు రిలీవ్‌

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:36 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన 34మంది తహసీల్దార్లను రిలీవ్‌ చేస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు.

34 మంది సొంత జిల్లాలకు కేటాయింపు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 25: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన 34మంది తహసీల్దార్లను రిలీవ్‌ చేస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సమయంలో సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఒకే స్థానంలో మూడేళ్లకుపైగా పనిచేస్తున్న తహసీల్దార్లు 34 మందిని ఇతర జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ భూపరిపాలనా కమిషనర్‌ అప్పట్లో ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం వారిని సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ 34మంది బుధవారం సాయంత్రమే రిలీవ్‌ అయ్యారు. ప్రత్యామ్నాయం కోసం చూడకుండా కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న డిప్యూటీ తహసీల్దార్లకు చార్జ్‌ అప్పగించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రిలీవ్‌ అయిన తహసీల్దార్లు పోస్టింగ్‌ల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లను సంప్రదించాల్సి ఉంది. ఈ తహసీల్దార్లు ఎవరిని వారి వారి సొంత రెవెన్యూ డివిజన్లలో నియమించవద్దని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - Jul 25 , 2024 | 11:36 PM

Advertising
Advertising
<