ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తేలని పంచాయితీ

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:40 PM

జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేసే గ్రేడ్‌-5,6 (సచివాలయ) ఉద్యోగుల పోస్టింగ్‌ల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. 50 రోజులుగా పంచాయితీ నడుస్తూనే ఉంది.

పూర్వపు డీపీవో ఇష్టారాజ్య ఫలితం

పోస్టింగ్‌లు లేక గాలిలో ఉన్న 56 మంది ఉద్యోగులు

50 రోజులుగా ఎదురుచూపులు

పీఆర్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ లేఖ రాసినా స్పందన కరువు

సర్వీసు కోల్పోతామని గ్రేడ్‌-5,-6 సచివాలయ ఉద్యోగుల ఆందోళన

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేసే గ్రేడ్‌-5,6 (సచివాలయ) ఉద్యోగుల పోస్టింగ్‌ల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. 50 రోజులుగా పంచాయితీ నడుస్తూనే ఉంది. పూర్వపు డీపీవో, కొందరు ఉద్యోగుల అవినీతి, అక్రమాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో 56 మంది ఉద్యోగులకు ఎక్కడా పోస్టింగ్‌లు లభించక గాలిలోనే ఉండిపోయారు. వారంతా ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాము సర్వీసు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌కు భిన్నంగా బదిలీలు

ఉద్యోగుల బదిలీలను కలెక్టర్‌ అన్సారియా ఇచ్చిన ప్రొసీడింగ్స్‌కు భిన్నంగా చేసినట్లు గుర్తించారు. దీంతో 56 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక గాలిలో ఉండిపోయారు. వారంతా కలెక్టర్‌తోపాటు ప్రస్తుత జిల్లా పంచాయతీ అధికారిని కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం పోస్టింగ్‌ లేక గాలిలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు 15 రోజుల క్రితం కలెక్టర్‌ లేఖ రాశారు. ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గాలిలో ఉన్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

బదిలీల్లో భారీగా అక్రమాలు

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నిశాఖల్లో ఆ ప్రక్రియను సాఫీగానే పూర్తి చేశారు. అయితే జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలు భారీగా చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. బదిలీల ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉద్యోగుల నుంచి అప్పటి అధికారి, కొందరు ఉద్యోగులు పెద్దమొత్తంలో వసూలు చేశారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా త్రిసభ్య కమిటీని నియమించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన కమిటీ అక్రమాలు నిజమేనని తేల్చింది. నివేదికను కలెక్టర్‌కు సమర్పించింది. దాన్ని పరిశీలించిన కలెక్టర్‌.. ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు 15 రోజుల క్రితం లేఖ రాశారు. దానికి త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను కూడా జతచేసి పంపారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. విచారణ ముగిసే లోపే ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యారు. అప్పట్లో డీపీవోగా ఉన్న ఉషారాణిపై చర్యలకు కలెక్టర్‌ సిఫార్సు చేశారు.


ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని ఉద్యోగుల విజ్ఞప్తి

ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు అనేది ఎంతో ముఖ్యమైంది. భవిష్యత్‌లో ఉద్యోగోన్నతలు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుతం గాలిలో ఉన్న ఉద్యోగులకు 50 రోజుల నుంచి పోస్టింగ్‌లు లేకపోవడంతో భవిష్యత్‌లో ఉద్యోగోన్నతులు కోల్పోతామని వారంతా ఆందోళన చెందుతున్నారు. వీరికి పోస్టింగ్‌లు ఇప్పించే విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా కూడా మరింత చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:40 PM