ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వెంగముక్కపాలెంలో ఉద్రిక్తత

ABN, Publish Date - May 15 , 2024 | 12:43 AM

ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం నుంచి వెంగముక్కపాలెంలో వైసీపీ నేతల హల్‌చల్‌తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి గ్రామంలో గల పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అక్కడి టీడీపీ వర్గీయులు ఆరోపిం చారు.

టీడీపీ వర్గీయుల ఇంటిపై వైసీపీ మూకల దాడి

నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు

పికెట్‌ ఏర్పాటు

ఒంగోలు(క్రైం), మే 14: ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం నుంచి వెంగముక్కపాలెంలో వైసీపీ నేతల హల్‌చల్‌తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి గ్రామంలో గల పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అక్కడి టీడీపీ వర్గీయులు ఆరోపిం చారు. దీంతో మొదట వలేటి ధనలక్ష్మిపై కావ్యారెడ్డి పక్కనే ఉన్న వైసీపీ మూకలు దాడిచేశారు. అదేక్రమంలో మరలా సాయత్రం ఆరు గంటల తర్వాత కూడ కావ్యారెడ్డి పోలింగ్‌ బూత్‌లోకి వె ళ్లడం, టీడీపీ ఏజెంట్‌ను బెదిరించడంతో మర లా వివాదం నెలకొంది. అలాగే వలేటి ధనలక్ష్మీ కుమారుడు అఖిల్‌పై దాడి చేశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు ధనలక్ష్మి కుమారుడు అఖిల్‌, కుమా ర్తె స్రవంతిలు ఆసుపత్రికి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో వైసీపీ మూక లు వారి ఇంటికి వెళ్లి గందరగోళం సృష్టించారు. ఇంటి కిటికీ అద్దాలు పగలకొట్టడంతో పాటుగా ఇంట్లో ఉన్న స్రవంతి, అఖిల్‌ను చంపుతామని బెదిరించారు. అడ్డుకున్న చుట్టుపక్కల వారిపై దౌర్జన్యం చేశారు. ఇలా ఎన్నికలు ముగిసిన త ర్వాత కూడా టీడీపీ వర్గీయులపై వైసీపీ మూక లు రెచ్చిపోయాయి. అంతేకాకుండా ఒకే కుటుం బాన్ని లక్ష్యంగా చేసుకుని రాత్రి పొద్దుపోయే వరకు దాడులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు కే సులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ భక్తవ త్సలరెడ్డి తెలిపారు. అలాగే వైసీపీ వర్గీయుడు అమర్నాథ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధనల క్ష్మిపై కౌంటర్‌ కేసు దాఖలు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో వెంగముక్కపాలెంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న దామచర్ల జనార్దన్‌ మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ తరుపున అందరం అండగా ఉంటామని వారికి భోరసా కల్పించారు.

Updated Date - May 15 , 2024 | 12:43 AM

Advertising
Advertising