తీరం అల్లకల్లోలం
ABN, Publish Date - Nov 30 , 2024 | 11:47 PM
అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ ప్రభావం వలన చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడరేవు, రామాపు రం, పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారిపాలెం సముద్రతీరంలో అలల ఉధృతంగా ఎగిసి పడుతున్నాయి. ఈక్రమంలో కొంత మేరకు సముద్రం ముందుకు పెరిగింది. దీంతో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ సిబ్బందితో కలిసి తీరంలో పర్యటించారు.
ఆర్డీవో, తహసీల్దార్ పర్యటన
మత్స్యకారులకు ఆంక్షలు,
అధికారులకు సూచనలు
వాడరేవు(చీరాలటౌన్), నవంబరు30 (ఆంధ్రజ్యోతి) : అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ ప్రభావం వలన చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడరేవు, రామాపు రం, పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారిపాలెం సముద్రతీరంలో అలల ఉధృతంగా ఎగిసి పడుతున్నాయి. ఈక్రమంలో కొంత మేరకు సముద్రం ముందుకు పెరిగింది. దీంతో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ సిబ్బందితో కలిసి తీరంలో పర్యటించారు. గంటకు సుమారు 90 మీటర్ల వేగం తో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్య్సకారులకు వేటకు వెళ్లరాదని సూచించారు. సురక్షిత ప్రదేశాలలో ఉండాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. అయితే వాయుగుండం కారణంగా మత్య్సకారులు ఇప్పటికే బోటులను ఒడ్డుకు చేర్చారు. వేట నిషేఽధించడంతో పూట గడిచేందుకు తిప్పలు తప్పడంలేదని మత్య్సకారులు వేదన చెందారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని అధికారులు చెప్పారు. అధికారులు పలువురు సిబ్బంది ఉన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 11:48 PM