ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కనుమరుగవుతున్న కోనేరు

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:18 AM

కొనేరు అంటే ఎంతో చరిత్ర, పాధాన్యత ఉంటుంది. అలాంటి కోనేరు నేడు చెత్త కుండిలా తయారైంది.

ఎర్రగొండపాలెం రూరల్‌ నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి) : కొనేరు అంటే ఎంతో చరిత్ర, పాధాన్యత ఉంటుంది. అలాంటి కోనేరు నేడు చెత్త కుండిలా తయారైంది. ఎర్రగొండపాలెం పట్టణంలోని కాశీవిశ్వే శ్వర దేవాలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న కోనేరే ఇందుకు ఉదాహరణ.

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొనేరు ప్రస్తుతం చెత్తతో నిండింది. ఆ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరు కూడా అక్కడే పేరుకుపోతోంది. దీంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. మరోవైపు ఈ ప్రాంతాన్ని విషసర్పాలు అవాసంగా మార్చుకున్నాయి. పురాతన కొనేరు ఇలా ఉండటంతో పట్టణ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ దారిలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే

మూడు రోడ్ల కూడలిగా ఉన్న ఈ రహదారిలో నిత్యం ప్రజలు తిరుగుతుంటారు. శివాలయానికి, ఆంజనేయ స్వామి దేవాలయాలకు భక్తులు ఉదయం సాయంత్రం వస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా తిరుగుతున్నారు. అలాగే కొనేరు సమీపంలో పాఠశాల కూడ ఉంది. ఈ పాఠశాలకు విద్యార్థు లు వారి తల్లిదండ్రులు వచ్చి పోయే సమయంలో దుర్వాస నకు ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

నాటి మంత్రిని పలుమార్లు కలిసినా

ఆ ప్రాంత ప్రజలు బ్రాహ్మణ సంఘం నాయకుల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి సమస్యను వివరించారు. అయితే ఆయన దీనిపై దృష్టి సారించలేదు. వెళ్లిన ప్రతి సారి అంచనాలు వేయాలని పనులు చేపట్టాలని అధికారులకు చెప్పడం మినహా చేసింది ఏమి లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న కొణెదెల పవన్‌కల్యాన్‌ స్పంఇంచి కోనేరు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:18 AM