ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా డెయిరీని పునరుద్ధరించాలి

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:37 PM

ఒంగోలు పాల డెయి రీ పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సీపీఐ జిల్లాసమితి ఆధ్వర్యంలో గురువారం జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అధ్యక్షత వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వరయ్య, పక్కన రంగారావు, నారాయణ తదితరులు

అందుకోసం సీఎం వద్దకు రాయబారం

పూర్వవైభవానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి

రూ.వెయ్యికోట్ల విలువైన ఆస్తులకు రక్షణ కల్పించాలి

ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 25 : ఒంగోలు పాల డెయి రీ పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సీపీఐ జిల్లాసమితి ఆధ్వర్యంలో గురువారం జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఈ శ్వరయ్య మాట్లాడుతూ పాడిరైతులు రూపాయి రూపాయి కూడబెట్టి ఒంగోలు డెయిరీని ఏర్పాటు చేసుకున్నారన్నారు. 1987లో పాలపొడి ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగ్గా స్థలానికి పాడిరైతులు రూ. 19 లక్షలు విరాళం కూడా ఇచ్చారన్నారు. 2014వరకు లాభాల బాటలో నడిచిన డెయిరీని సహకారరంగం నుంచి కంపెనీ యాక్టులోకి తీసుకరావడంతో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఆ తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నాశనం చేసిందని విమర్శించారు. డెయిరీని ప్రభుత్వం నిర్వహించాలని అందుకో సం సీఎం చంద్రబాబు వద్దకు రాయబారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. వెయ్యి కోట్ల ఆస్తుల కు రక్షణ కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. ఒంగోలు డె యిరీ పూర్వాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ డెయిరీ పాలన సహకారం నుంచి కంపెనీ యాక్టులోకి వెళ్లిన నాటి నుంచి వ్యక్తుల చేతుల్లోకి పోయి పూర్తిస్థాయిలో నాశనమైందన్నారు. రంగా కిసాన్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌హానీ్‌ఫలు మాట్లాడుతూ ఒంగోలు డెయిరీ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవీఎన్‌ స్వామి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీవీఆర్‌ చౌదరి, ఎస్‌.లలితకుమారి, కొత్తకోట వెంకటేశ్వర్లు, పమిడి వెంకట్రావు, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు

Updated Date - Jul 25 , 2024 | 11:37 PM

Advertising
Advertising
<