ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:20 AM

వాతావరణంలో వస్తున్న మార్పులతో మండలంలోని పలు గ్రామాల్లో జ్వరాలు ప్రారంభమయ్యాయి.

త్రిపురాంతకం, జూన్‌ 23: వాతావరణంలో వస్తున్న మార్పులతో మండలంలోని పలు గ్రామాల్లో జ్వరాలు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతల్లో తేడాలతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు పలు గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. రోడ్లపైనే మురికి నీరు నిలబడడంతో దోమలు వృద్ది చెందుతున్నాయి. గ్రామస్థాయి అధికారులు, వైద్యశాఖ సిబ్బంది ముందు నుండే జాగ్రత్త పడి జ్వరాలను నియంత్రించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీజనల్‌ వ్యాధులు ఇవే : గ్రామాలలో డ్రైనేజి సౌకర్యాలు లేకపోవడంతో రోడ్లపైనే మురికినీరు నిలుస్తుంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్‌ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, గొంతునొప్పి, మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా, విషజ్వరాలు, డెంగ్యూ, బోదకాలు వంటివి ప్రబలే అవకాశాలున్నాయి.

జ్వరం : మనిషి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలుగా ఉంటుంది. 100 డిగ్రీలు ఉంటే స్వల్పంగాను, 102 డిగ్రీలు లోపు ఉంటే సాధారణ జ్వరంగాను, 104 డిగ్రీలు దాటితే ప్రమాదకరమైన జ్వరంగాను పరిగణించాలి.

డెంగ్యూ లక్షణాలు

మనిషికి 104 డిగ్రీలు జ్వరం వస్తే తలనొప్పి, కడుపునొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దుల్లు వస్తాయి. జ్వరం 105 డిగ్రీలకు చేరుకుంటే రోగి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

విష జ్వరాలు : ఒళ్ళు నొప్పులు, జలుబు, తుమ్ములతో జ్వరం వస్తుంది. వారం రోజుల పాటు జ్వరం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, చలి, నీరసం విష జ్వరాల ప్రధాన లక్షణం.

మలేరియా : మలేరియా వ్యాధికి ముందు జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. సాయంత్రం కాగానే జ్వరం తగ్గుతుంది. విపరీతంగా చలి, వణుకు వస్తాయి. చేతులు, కాళ్ళు తిమ్మిర్లుగా ఉంటాయి. వాంతులు, విరేచనాలు అవుతూ ఆకలి సరిగా ఉండదు. మనిషి పూర్తిగా నీరసిస్తాడు.

దోమలను అరికట్టే విధానం :

ఇళ్ళలోని మంచినీటి తొట్లలో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు, దోమ లు ముసరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో వేస్ట్‌ ఆయిల్‌ స్ర్పే చేయాలి. దోమ తెరలను తప్పని సరిగా ఉపయోగించాలి. గ్రామాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా, లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలి

రోగాలు వ్యాపించకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. కాచి వడపోసిన నీటిని తీసుకోవాలి. రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలు తినకూడదు. రోజూ జ్వరం వచ్చి తగ్గుతుంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డాక్టర్‌ ఎం.నాగేశ్వరనాయక్‌

Updated Date - Jun 24 , 2024 | 01:20 AM

Advertising
Advertising