ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కంకర వేశారు.. తారు వేయడం మరిచారు..!

ABN, Publish Date - May 18 , 2024 | 10:01 PM

అధ్వాన రోడ్డుతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలోని రెడ్డినగర్‌ నుంచి బసవా పురం, శ్రీనివాసనగర్‌ వెళ్ళే పంచాయతీరా జ్‌ రహదారిలో ప్రయాణమంటే భయపడే పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గోతులమయం కావ టంతో ఆ రహదారిపై ప్రయాణం చేసే వాహన చోదకు లు అల్లాడిపోతున్నారు. రెడ్డినగర్‌ నుంచి బసవాపురం వ రకు రెండు కిలోమీటర్లు ఉండే ఈరహదారికి వైసీపీ ప్ర భుత్వంలో 2021-22 సంవత్సరంలో రూ 1.60 కోట్లు ని ధులు పంచాయతీ రాజ్‌ స్పెషల్‌ గ్రాంట్‌ నుంచి తారు రో డ్డు కోసం నిధులు మంజూరు చేసింది.

ముండ్లమూరు: అధ్వానంగా రెడ్డినగర్‌, బసవాపురం రహదారి.. పామూరు: కందులవారిపల్లిలో రోడ్డుపై నిలిచిఉన్న మురుగు నీరు

అధ్వానస్థితిలో రెడ్డినగర్‌, బసవాపురం రహదారి

పలుగ్రామాల ప్రజల అవస్థలు

ముండ్లమూరు, మే 18: అధ్వాన రోడ్డుతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలోని రెడ్డినగర్‌ నుంచి బసవా పురం, శ్రీనివాసనగర్‌ వెళ్ళే పంచాయతీరా జ్‌ రహదారిలో ప్రయాణమంటే భయపడే పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గోతులమయం కావ టంతో ఆ రహదారిపై ప్రయాణం చేసే వాహన చోదకు లు అల్లాడిపోతున్నారు. రెడ్డినగర్‌ నుంచి బసవాపురం వ రకు రెండు కిలోమీటర్లు ఉండే ఈరహదారికి వైసీపీ ప్ర భుత్వంలో 2021-22 సంవత్సరంలో రూ 1.60 కోట్లు ని ధులు పంచాయతీ రాజ్‌ స్పెషల్‌ గ్రాంట్‌ నుంచి తారు రో డ్డు కోసం నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌ ద క్కించుకున్న గుత్తేదారు పనులు మొదలుపెట్టి 50 శా తంమేర పూర్తి చేశారు. ఆతరువాత ఇప్పటి వరకు సం బంధిత కాంట్రాక్టర్‌ కన్నెత్తి కూడా చూడలేదు. రహదా రికి వాడిన కంకరు లేచిపోవటంతో గోతులమయమైంది. చిన్న చినుకు పడినా ఆగోతుల్లో నీరుచేరి వాహన చోదకులు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్ప డింది. ప్రధానంగా ఈ రహదారిపై రెడ్డినగర్‌, శ్రీనివాస నగర్‌, జగత్‌నగర్‌లతో పాటు కెల్లంపల్లి గ్రామాలకు చెం దిన వారు నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. కేవలం ప ది నిమిషాలు పట్టే ప్రయాణం అరగంట పైన పడుతుం దంటే ఆ రహదారి దుస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త వ్యక్తులు ఆ రహదారిపై రాత్రుల పూట ప్రయాణం చే స్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు. ఇ ప్పటికైనా సంబంధిత అఽధికారులు స్పందించి తాత్కా లికంగానైనా గోతులు పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందు లు లేకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కో రుతున్నారు.

అలాగే, మండలంలోని పసుపుగ ల్లు నుంచి వేములబండ వెళ్ళే ఆర్‌ అండ్‌బీ రహదారిని చిల్లచెట్లు కమ్మే శాయి. దీంతో వాహనచోదకులు అవ స్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ఆస్పత్రి పాలైన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ర హదారికి ఇరువైపులా చిల్లచెట్లు తొల గించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు మరమ్మతు చేయరూ..

పీసీపల్లి, మే 18: పీసీపల్లి బస్టాండు సెంటరు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెెళ్లే రోడ్డు అ డుగుకో గుంత మూరకో గొయ్యిలా తయారైంది. వర్షం పడితే అడుగు తీసి అడుగు కూడా వేయ లేని దుస్ధితి నెలకొంది. వర్షం కురిసినప్పుడు ఆ గోతులో మోకాలులోతు నీరు నిలిచి ఉంటుంది. ఆ మార్గం గుండా వాహనాలు వెళ్తున్న సమ యంలో ఆ గుంతల్లోని మురుగునీరు ఎగిరి పక్కన ఉన్న ఇళ్లల్లో పడుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండానే ఎంపీడీవో, తహ సీల్దార్‌, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పోతుంటారు. ఈ రోడ్డు మరమ్మ తులు గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ రోడ్డు దుస్ధితిపై ప్రజలు అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చలనంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు చేయించాలని ప్రజలు కోరు తున్నారు.

రోడ్డుపై నిలిచిపోతున్న వర్షపునీరు

పామూరు, మే 18: మండలంలోని పడమట కట్టకిందపల్లి పంచాయతి కందులవా రిపల్లి గ్రామ బీసీ కాలనీలో రోడ్డు ఎత్తు తగ్గడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి పోతుంది. దీంతో ఆప్రాంతమంతా దు ర్గంధం వెదజల్లుతుందని స్థానికులు వా పోతున్నారు. గతంలో గ్రామ పంచాయ తీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మధ్యలో రోడ్డు ఎత్తు తగ్గిం చడంతో వర్షపు నీరు రోడ్డుపై సక్రమం గా ప్రవహించక ఎత్తు తక్కువగా ఉన్న దగ్గర నిలిచిపోతుంది. దాంతో బురద నీరులో నడవడానికి ఆవీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడిరోడ్డుపై నీరు నిలువ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దాంతో ఎక్కడ దోమ కాటుకు గురై వ్యాధులు బారిన పడాల్సివస్తోందని స్ధానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డు ఎత్తు తక్కువ ఉన్న ప్రాంతంలో మెరక పనులు చేసి నీరు రోడ్డుపై నిలువ చేరకుండా చూడాలని స్ధానికులు కో రుతున్నారు.

దీనిపై సచివాలయ కార్యదర్శి షేక్‌ జాని మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలో బావి ఉండ టంతో రోడ్డు ఎత్తు తగ్గించారని చెప్పారు. ప్రస్తుతం బా విని పూడ్చి వేశారని తెలిపారు. ఎత్తు తక్కువగా ఉన్న ప్రాంతంలో రోడ్డు మెరక పనులు చేపట్టి స్ధానికుల ఇ బ్బందులు తొలగిస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 18 , 2024 | 10:01 PM

Advertising
Advertising