ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నారుమళ్లు.. తడికోసం తంటాలు

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:09 AM

ఇంకొల్లు, గొల్లపాలెం మధ్య సాగరు కాలువ ఆయకట్టు పరిధిలోని చివరి భూములలో పొగనారుమళ్లు సాగుచేస్తున్నారు. గత ఏడాది వైట్‌బర్లీ, బ్యారన్‌ పొగాకుకు మంచి ధరలు పలికాయి. ఈ ఏడాది కూడా వైట్‌బర్లీ, బ్యారన్‌ పొగాకు విస్తీర్ణం పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు పొగాకు నారమళ్లు సాగుచేస్తున్నారు.

పొగనారు మళ్లకు నీళ్లు పెడుతున్న మహిళ కుంటలో నీటిని ఇంజన్‌ ద్వారా నారుమడికి పెడుతున్న రైతు

సాగర్‌ కాలువ చివరి భూములకు రాని నీరు

ట్రాక్టర్‌ ఇంజన్ల సాయంతో తడులు

పెరుగుతున్న పెట్టుబడి

సాగుదారుల ఆందోళన

అన్నీ అనుకూలంగా ఉంటే వ్యవసాయం లాభసాటి. లేదంటే నష్టం తప్పదు. అదునులో పదును కావాలి. పదును భూమిలో వి త్తనం పడాలి. అనంతరం సాగునీరు (వర్షం లేదా ఇతర వనరు ల నుంచి) అందాలి. సకాలంలో సస్యరక్షణ చర్యలు, మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. పంట దిగుబడులు చేతికి అందే వరకు ప్రకృతి వైపరీత్యాలు ఉండకూడదు. ఇదంతా జరిగితేనే రైతు, కూలీకి నాలుగు రూపాయలు మిగిలేది. లేదంటే నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని రైతులు ముక్తకంఠంతో చెప్తున్నారు.

చీరాల, అక్టోబరు 9 : ఇంకొల్లు, గొల్లపాలెం మధ్య సాగరు కాలువ ఆయకట్టు పరిధిలోని చివరి భూములలో పొగనారుమళ్లు సాగుచేస్తున్నారు. గత ఏడాది వైట్‌బర్లీ, బ్యారన్‌ పొగాకుకు మంచి ధరలు పలికాయి. ఈ ఏడాది కూడా వైట్‌బర్లీ, బ్యారన్‌ పొగాకు విస్తీర్ణం పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు పొగాకు నారమళ్లు సాగుచేస్తున్నారు. సాగర్‌ఆయకట్టు చివరి భూములు కావడంతో సాగునీరు రావడం లేదు. రెండో వైపు కొమ్మమూరు కాలువ పరిధిలో ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే సాగునీరు సాగుదారులకు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు సమీపంలో చెరువులో నీటిని ట్రాక్టర్‌ ఇంజన్‌, ఆయిల్‌ ఇంజన్లతో పంప్‌చేస్తూ పైప్‌లైన్ల ద్వారా నారుమళ్లు నీటి తడులు ఇస్తున్నారు. ఇది అదనపు ఖర్చు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమళ్లకు దుక్కి దున్నకం, బెడ్లు ఏర్పాటు, విత్తనాలు చల్లడం, ఎరువులు, పురుగుమందులు, నీటి తడులు, కూలీ, కౌలు తదితరాలను లెక్కిస్తే ఎకరాకు సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుంది. అన్నీ సక్రమంగా ఉండి నారు విక్రయాలు జరిగితే నాలుగు రూపాయలు మిగులుతాయి. నారుమళ్లలో సస్యరక్షణ కీలకం. వరు స వర్షాలు లేదా మంగువాతావరణం ఉండకూడదు. బెట్టకు రాకూడదు. ఉదయం, సాయంత్రం నీటిని పైపాటును పిచికారీ చేయాల్సిందే. కాలువలో నీరులేక పోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాలువకు సాగునీరు వచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆ పరిధిలో నారుమళ్లతో పాటు ఇతర పంటలు సాగుచేసిన, చేయాల్సిన రైతులు కోరుతున్నారు. అందుకు అనుగుణంగా అధికారగణం స్పందిస్తారని ఆశిద్దాం.

Updated Date - Oct 10 , 2024 | 12:09 AM