కోలాహలంగా..
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:15 AM
ఒకవైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా కోలాహలంగా సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచే ఊరూవాడా పింఛన్‌ల పంపిణీ ప్రారంభం కాగా మధ్యాహ్నం తర్వాత ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలను నిర్వహించారు.
ఉచిత సిలిండర్లు... పింఛన్లు
జిల్లావ్యాప్తంగా పంపిణీ
ఉదయం నుంచే ఊరూవాడా సందడిగా కార్యక్రమం
ఒంగోలు, కారుమంచిలో పాల్గొన్న మంత్రి స్వామి
ఇతర చోట్ల కీలక ప్రజాప్రతినిధుల హాజరు
ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా కోలాహలంగా సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచే ఊరూవాడా పింఛన్‌ల పంపిణీ ప్రారంభం కాగా మధ్యాహ్నం తర్వాత ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలో మొత్తం నవంబరు నెలకు 2,87,127 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతర పలువర్గాల వారికి పింఛన్ సొమ్ము రూ.122.21 కోట్లు మంజూరైంది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు 93.7శాతం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల సర్వర్ సమస్యతో ఆలస్యమైనట్లు సమాచారం. అలాగే మధ్యాహ్నం తర్వాత సిలిండర్ల అందజేత కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీ లలో ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు అప్పటి కూటమి అధినేతగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక దీపావళి నుంచి ఆ హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తదనుగుణంగా శుక్రవారం అందజేశారు. జిల్లాలో మొత్తం 6.70 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా 4.80 లక్షల మంది ఈకేవైసీ చేయించుకున్నారు. అక్టోబరు 29నుంచి ఉచిత సిలిండర్ల బుకింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా జిల్లాలో 18,194 మంది బుక్ చేసుకోవడంతో వారికి శుక్రవారం అందజేశారు.
మంత్రితోపాటు ఇతర నేతల పంపిణీ
జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో మంత్రి నుంచి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అలాగే టీడీపీ ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి వరకు నాయకులు పంపిణీలో పాల్గొన్నారు. జిల్లా మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే ఒంగోలులో జరిగిన సిలిండర్ల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 14వ డివిన్‌లో సిలిండర్లు పంపిణీ చేశారు. మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మద్దిపాడు మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలో పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రమైన మద్దిపాడులో సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగినిలోని సచివాలయం-1పరిధిలో సిలిండర్లు పంపినీ చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు పట్టణంలో పాల్గొన్నారు. టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో పింఛన్ల పంపిణీలోనూ, ఎర్రగొండపాలెం పట్టణంలో సిలిండర్ల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణంలోనే ఉదయం ఫించన్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సిలిండర్లు అందజేశారు. ఇతర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, అధికారపార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి.
Updated Date - Nov 02 , 2024 | 01:15 AM