ప్రగతిబాటలో పల్లెలు
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:48 PM
కూటమి ప్రభుత్వంలో రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరైన నిధులను దారి మళ్లించింది. గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. దీంతో పంచాయతీల అభివృద్ధికి నిధులు రాకపోవటంలో అప్పట్లో సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లోని రహదారులకు పట్టిన గ్రహణం వీడింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
మారుతున్న రూపురేఖలు
కూటమి ప్రభుత్వం చొరవతో సీసీ రోడ్ల నిర్మాణాలు
తీరనున్న ప్రజల ఇబ్బందులు
దొనకొండ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరైన నిధులను దారి మళ్లించింది. గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. దీంతో పంచాయతీల అభివృద్ధికి నిధులు రాకపోవటంలో అప్పట్లో సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లోని రహదారులకు పట్టిన గ్రహణం వీడింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. పల్లెపండుగ పేరుతో ఉపాధిహమీ పథకం నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. దొనకొండ మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో 39 సిమెంట్ రోడ్ల పనులకు గాను రూ.3కోట్ల నిధులు మంజూరయ్యాయి. అన్నీగ్రామాల్లో ఐదేళ్ళ తర్వాత ముమ్మరంగా సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండటంతో గ్రామాల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు చివరి నాటికి సిమెంట్ రోడ్ల నిర్మాణాలు నూరుశాతం పూర్తయ్యేలా పీఆర్ ఏఈ పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి.
హమీలను నెరవేరుస్తున్నారు
- మోడి పెద్దఆంజనేయులు, ఎర్రబాలెం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీడీపీ నేతలు ఇచ్చిన హమీలను నెరవేర్చుతున్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వంలో అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతుండటం హర్షనీయం.
గ్రామాల్లో సిమెంట్ రోడ్ల
నిర్మాణాలు హర్షనీయం
షేక్ రసూల్, దొనకొండ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టటం హర్షనీయం. దొనకొండ పంచాయుతీలో రూ.50 లక్షలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపడుతున్నారు. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి వెళ్లే మట్టిరోడ్డుపై వర్షం కురిస్తే రాకపోకలు జరుపుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కూటమి ప్రభుత్వం చొరవతో నేడు సిమెంట్‌రోడ్డు నిర్మాణం జరగటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:48 PM