ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజన్‌-47 లక్ష్యంగా ముందుకు..

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:22 PM

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 పేరుతో ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా 11 అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

అభిప్రాయాలు సేకరిస్తున్న సిబ్బంది

క్యూఆర్‌ కోడ్‌తో అభిప్రాయ సేకరణ

11 అంశాలపై సర్వే ముమ్మరం

క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సాంకేతిక

ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 పేరుతో ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా 11 అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుండగా అప్పటికి ప్రపంచంలో మూడో అగ్రగామి శక్తిగా భారత్‌ నిలవాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం వికసిత భారత్‌ 2047 పేరుతో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఇదేసమయంలో రాష్ట్రాన్ని పునర్నినిర్మాణ లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వం కూడా 2047 నాటికి దేశంలో ఏపీ ఒక పెద్ద వృద్ధి చెందిన రాష్ట్రంగా తయారవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఆర్థిక, సామాజిక, వాతావరణ సుస్థిరతలపై దృష్టిసారించి స్వర్ణాంధ్ర 2047 పేరుతో దార్శనిక పత్రం(విజన్‌) రూపొందిస్తున్నారు. వచ్చే నవంబరు 1న దానిని ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈలోపు ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం క్యూఆర్‌ కోడ్‌ను ప్రత్యేకంగా రూపొందించి దాని ద్వారా సేకరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ప్రశ్నల రూపంలో మొత్తం 18 అంశాలు వరుసగా వస్తాయి. ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, నైపుణ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటకం, వాతావరణ సమతుల్యత, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలు ఉన్నాయి. మండల పరిషత్‌ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్ల పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది ద్వారా అభిప్రాయాల సేకరణ చేస్తున్నారు.


ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక

జిల్లాలో ఐదు రోజులుగా ఈ క్యాంపెయిన్‌ కొనసాగుతుండగా ఇప్పటివరకు 70వేల మంది అభిప్రాయాలు తెలియజేసినట్లు సమాచారం. మరో 30వేల మందిని 5వతేదీలోగా సర్వే చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా 2047 అనేది సుదీర్ఘ సమయం కావడంతో జిల్లా, మండలస్థాయిలో ప్రగతి కోసం 2024 -29 మధ్య ఐదేళ్ల కార్యచరణ ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా సహజ వనరులు, వాటి సద్వినియోగం, విద్య, ఉపాధి అవకాశాలు పెంపు, అందుకు వ్యవసాయ. పారిశ్రామిక, సేవారంగాలలో తీసుకోవాల్సిన చర్యలను ఈ ప్రణాళికల్లో పొందుపరుస్తున్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:22 PM