నగర సుందరీకరణకు ‘వార్డుకో వారం’
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:00 PM
ఒంగోలు నగర సుందరీకరణ కోసం ‘వార్డుకో వారం’ ప్రత్యేక పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాలను శ్రీకారం పలికినట్లు నగర కమిషనరు డాక్టర్ కే వెంకటేశ్వరరావు చెప్పారు.
శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో కమిషనరు వెంకటేశ్వరరావు
వెంగముక్కలపాలెం సచివాలయ సెక్రటరీలకు షోకాజ్ నోటీసు
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : నగర సుందరీకరణ కోసం ‘వార్డుకో వారం’ ప్రత్యేక పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాలను శ్రీకారం పలికినట్లు నగర కమిషనరు డాక్టర్ కే వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ మేరకుసోమవారం స్థానిక వెంగముక్కలపాలెం, లాయరుపేటలో మేయర్ గంగాడ సుజాతతోకలిసి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనగరంలోని ఆయా డివిజన్లలో కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు శుభ్రంచేయడం, రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించడం, ఆయిల్ స్ర్పేయింగ్ వంటివి చేస్తామని చెప్పారు. అలాగే వీధిదీపాల మరమ్మతులు, తాగునీటి సమస్యలు, పైపులైను లీకులు, గుంతల రోడ్లు పూడ్చి వేయడం వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు, సిబ్బందితోపాటువార్డు ప్లానింగ్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ, హెల్త్ ఆఫీసర్, వెల్‌ఫేర్ సెక్రటరీ పాల్గొనాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, వెంగముక్కలపాలెంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వర్తించని కార్మికులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనరు హెల్త్ ఆఫీసర్ మనోహర్‌రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా విధులకు గైర్హాజరైన సచివాలయ సిబ్బంది,వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీస్, హెల్త్ సెక్రటరీ, వెల్‌ఫేర్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు చెప్పారు.
Updated Date - Nov 11 , 2024 | 11:00 PM