ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసాంఘిక శక్తులను ఏరిపారేస్తాం

ABN, Publish Date - Jun 23 , 2024 | 11:09 PM

‘నియోజవకర్గంలో అసాంఘిక శక్తులను ఏరిపారేస్తాం. జరిగిన, జరుగుతున్న సంఘనలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. తీరప్రాంతంలో రిసార్ట్స్‌ నిర్వహకులు పర్యాటకుల భద్రత బాధ్యతను తీసుకోవాలి. అలా కాదనే రిసార్ట్‌లకు తాళాలు వేయిస్తాను. రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లకు చెక్‌ చెప్తాం. అందుకు డిపార్ట్‌మెంట్‌పరంగా కఠినంగా వ్యవహరిస్తామని’ ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య నిప్పులు చెరిగారు. అధికారులు సక్రమంగా పనిచేయండి. లేదా వెళ్లిపొండి. మీ అంతట మీరు వెళితే సంతోషం. నేను పంపిస్తే వీఆర్‌(వేకెన్సీ రిజర్వ్‌డ్‌)నని కొండయ్య స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, జూన్‌ 23 : ‘నియోజవకర్గంలో అసాంఘిక శక్తులను ఏరిపారేస్తాం. జరిగిన, జరుగుతున్న సంఘనలపై ఉక్కుపాదం మోపుతాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. తీరప్రాంతంలో రిసార్ట్స్‌ నిర్వహకులు పర్యాటకుల భద్రత బాధ్యతను తీసుకోవాలి. అలా కాదనే రిసార్ట్‌లకు తాళాలు వేయిస్తాను. రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లకు చెక్‌ చెప్తాం. అందుకు డిపార్ట్‌మెంట్‌పరంగా కఠినంగా వ్యవహరిస్తామని’ ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య నిప్పులు చెరిగారు. అధికారులు సక్రమంగా పనిచేయండి. లేదా వెళ్లిపొండి. మీ అంతట మీరు వెళితే సంతోషం. నేను పంపిస్తే వీఆర్‌(వేకెన్సీ రిజర్వ్‌డ్‌)నని కొండయ్య స్పష్టం చేశారు. ఆదివారం వేటపాలెం మండలం రామాపురం తీరంలో మంగళగిరికి చెందిన 12 మంది బంగారు పనివారు ఆటవిడుపుగా వేటపాలెం మండలం రామాపురం వచ్చారు. సముద్రంలో దిగిన నేపథ్యంలో ఇరువురు ప్రమాదకరస్థితికి చేరారు. వారు మృతి చెందారు. ఇదిలా ఉంటే చీరాల సంగం ఽథియేటర్‌ సమీపంలో సంతోష్‌ అనే కర్రీస్‌ పాయింట్‌ వ్యాపారి, పండ్ల వ్యాపారి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో పండ్ల వ్యాపారి సంతో్‌షను కత్తితో పొడవటంతో మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై ఎమ్మెల్యే కొండయ్య ఘాటుగా స్పందించారు. ఏరియా వైద్యశాలలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. ఆ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ఈపురుపాలెంలో యువతి రేప్‌, హత్యకు సంబంధించి గంటల వ్యవధిలో హోం మినిస్టర్‌, ఎమ్మెల్యేగా తాను సీఎం చంద్రబాబు ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టడంతో పాటు, నిందితులను పట్టుకోవటం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో ఏం జరిగిందనేది తనకు అనవసరమని, ఇకపై అసాంఘీక శక్తులు ఎక్కడ అలజడి సృష్టించాలని ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గంజాయి బ్యాచ్‌లకు వెన్నులో వణుకు పుట్టిస్తామన్నారు. అందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ఎన్నికల వేళ కొందరు తన పైనే దాడి చేయటానికి ప్రయత్నించారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే కోణంలో పరిశీలించి కఠినతరంగా వ్యవహరిస్తామని ఘాటుగా చెప్పారు. మంగళగరి అంటే మంత్రి లోకేష్‌ నియోజకవర్గం నుంచి వచ్చిన వారికి ఇలా జరగటం కలిచివేచిందన్నారు. జరిగిన నష్టం పూడ్చలేనిది. అయితే ఇవే ఆఖరి ఘటనలు కావాలని చెప్పారు. రిసార్ట్స్‌ నిర్వాహకులు, అధికారులతో సమీక్ష జరిపి తగిన చర్యలు చేపడతాం. వారు సక్రమంగా స్పందిస్తే సరేసరి. సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే వాటికి తాళాలు వేయిస్తామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 11:09 PM

Advertising
Advertising