ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూచిపూడి హైస్కూల్‌ పనులు ప్రారంభిస్తాం

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:09 AM

అర్ధంతరంగా ఆగిపోయిన కూచిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఎంఈవో రంగయ్య తెలిపారు. ‘పరదాల కింద చదువు.. వానొస్తే సెలవు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

కూచిపూడి పాఠశాల యజమాన్య కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న ఎంఈవో రంగయ్య

ఎంఈవో రంగయ్య

ఎస్‌ఎంసీ కమిటీతో సమావేశం

మర్రిపూడి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అర్ధంతరంగా ఆగిపోయిన కూచిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఎంఈవో రంగయ్య తెలిపారు. ‘పరదాల కింద చదువు.. వానొస్తే సెలవు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. డీఈవో కిరణ్‌కుమార్‌ ఎంఈవో రంగయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కూచిపూడి చేరుకున్న ఎంఈవో.. పాఠశాల యాజ మాన్య కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ ఖాతాలో ఉన్న రూ.6.60లక్షలతో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆమేరకు ఎస్‌ఎంసీ చైర్మన్‌కు సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేస్తే తిరిగి మరికొంత మంజూరయ్యే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. బుధవారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు ఎంఈవో విలేకరులకు తెలిపారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయు రాలు సరస్వతి, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ చిన్నసుబ్బారావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు వై.వెంకటరెడ్డి, పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 01:09 AM