వర్షపు నీరు వెళ్లే దారేది?
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:25 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం అడ్డగోలుగా ప్రైవేటు వెంచర్ల ను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
మార్కాపురం రూరల్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి) : రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం అడ్డగోలుగా ప్రైవేటు వెంచర్ల ను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. స్థలాలు కొనాలనుకొనే అమాయక ప్రజలను మాయ యాటతో పాట్లు కట్టబెట్టేస్తున్నారు. అయితే వర్షపునీరు వెళ్లే మార్గం లేక పలు వెంచర్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
మార్కాపురంలోని బోడపాడు వెళ్లే దారిలో, జాతీయ రహదారి 565 సమీపంలో కొత్తగా వెంచర్లు వేశారు. ఈ ప్రాంతంలో భవిష్య త్తులో ఇంటి నిర్మాణాలు చేపట్టి నా ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాలు చేసిన వారు భవిష్యత్తులో ఎప్పుడై నా వర్షపు నీటితో ప్రమా దం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఈ ప్రాంతంలో రైతులు సాగు చేసిన జొన్న పంట 15 రోజులుగా వర్షపు నీటిలోనే మునిగి పోయింది. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు ఎటూ వెళ్లే మార్గంలేక పోవడంతో జొన్నపంటలో, ప్లాట్‌లలో నీరు నిలిచింది. దాదాపు పదిహేను రోజులుగా జొన్న పంట నీటి మునిగి ఉండటంతో పంట పూర్తిగా దెబ్బతింటోందని రైతు వాపోతున్నారు. సుమారు 15 రోజులుగా మార్కాపురం - బోడపాడు రోడ్డు జాతీయ రహదారికి ఆనుకొని వర్షపు నీరు నిల్వ ఉండటంతో రోడ్డు కుంగే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి వర్షపు నీరు పోయే మార్గాన్ని చూపి సమస్యను పరిస్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 03 , 2024 | 01:25 AM